భారత్ వేదికగా అక్టోబర్ లో ఈ ఏడాది వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కి నేరుగా అర్హత సాధించని విండీస్ జట్టు క్వాలిఫయర్ మ్యాచులు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఇప్పుడు టీమిండియా విండీస్ లో పర్యటించడం వెస్టిండీస్ క్రికెట్ జట్టుకి ఒక పెద్ద సమస్యగా మారింది. అదే జరిగితే సిరీస్ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టీమిండియా మరో సిరీస్ ఆడలేదు. ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ ప్లాన్ చేసిన వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు మన జట్టు ఖాళీగానే ఉంటుంది. అయితే షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు విండీస్ లో పర్యటించాల్సి ఉంది. రెండు టెస్టులు, మూడు వన్డేలతో పాటు 5 టీ 20 మ్యాచులు ఆడాల్సి ఉంది. జూలై 12 నుంచి మొదటి టెస్టుతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఇక ఆగష్టు 13 న జరిగే చివరిదైన 5 వ టీ 20 మ్యాచ్ ద్వారా విండీస్ టూర్ ముగుస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు టీమిండియా విండీస్ లో పర్యటించడం వెస్టిండీస్ క్రికెట్ జట్టుకి ఒక పెద్ద సమస్యగా మారింది. అదే జరిగితే సిరీస్ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్ వేదికగా అక్టోబర్ లో ఈ ఏడాది వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కి నేరుగా అర్హత సాధించని విండీస్ జట్టు క్వాలిఫయర్ మ్యాచులు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా ఈ నెల 29 వరకు ఈ మ్యాచులు జరగనున్నాయి. ఒకవేళ విండీస్ సూపర్ సిక్స్ దశకు చేరితే జులై 9 వరకు మ్యాచులు ఆడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే కరీబియన్ జట్టుకి ఆందోళన కలిగిస్తుంది. 9 వ వరకు క్వాలిఫయింగ్ మ్యాచులు ఆడి 12 న టెస్టు మ్యాచ్ ఆడడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. అదే జరిగితే షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. విండీస్ కి భారత్ తో సిరీస్ ఎంత ముఖ్యమో.. వరల్డ్ కప్ కి అర్హత సాధించడం కూడా అంతే ముఖ్యం.
అయితే విండీస్ కి మూడు ఫార్మాట్ కి సెపరేట్ జట్టు ఉన్నప్పటికీ.. మూడు ఫార్మాట్ లు ఆడే కొంతమంది కీ ప్లేయర్స్ ప్రస్తుతం క్వాలిఫయర్ మ్యాచులు ఆడుతున్నారు. విండీస్ వన్డే టీమ్ లో సభ్యులుగా ఉన్న కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ లు టెస్టులలో రెగ్యులర్ ప్లేయర్లు. వీరిని క్వాలిఫయర్ మ్యాచ్ లు ముగిసిన వెంటనే సూపర్ సిక్సెస్ ఫైనల్ ఫేజ్ కు ముందే విండీస్ కు రప్పించేందుకు క్రికెట్ వెస్టిండీస్ సన్నాహకాలు చేస్తున్నది. తమకు వన్డే వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ తో పాటు, భారత్ తో సిరీస్ ముఖ్యమని.. అందుకే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటామని క్రికెట్ వెస్టిండీస్ ప్రతినిధి ఒకరు తెలిపాడు. టెస్టు ప్లేయర్లపై భారం పడనీయకుండా చూస్తామని కూడా ఆయన చెప్పాడు. మరి షెడ్యూల్లో మార్పులు చేస్తారా ? లేకపోతే సూపర్ సిక్స్ కి ముందు టెస్టు ప్లేయర్లను భారత్ సిరీస్ కోసం పిలిపిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.