మొదట బ్యాటింగ్ లో భారీ ఇన్నింగ్స్.. తరువాత వికెట్ల వేటలో విజృంభణ.. ఇదీ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆటగాళ్ల ప్రదర్శన. రవీంద్రుడి మాయాజాలంతో కేవలం మూడు రోజుల్లోపే మ్యాచ్ ముగిసింది. తొలిసారి పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మకు.. అలాగే విరాట్ కోహ్లికి ప్రత్యేకమైన వందో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో సత్తా చాటిన భారత బ్యాట్సమెన్ బౌలింగ్ లోనూ అదే జోరు కొనసాగించారు. దీంతో ఇన్నింగ్స్, 222 పరుగుల తేడాతో విజయం సాధించారు. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. రవీంద్ర జడేజా అద్భుత సెంచరీ(175 పరుగులు)తో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో ఫాలో ఆన్ ఆడిన కరుణరత్నే బృందానికి మూడో రోజు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకు అవుట్ అయ్యింది. శ్రీలంక బ్యాట్సమెన్ లో.. తొలి ఇన్నింగ్స్ లో నిస్సంక (61*) పరుగులతో హైయెస్ట్ రన్ స్కోరర్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో నిరోషన్ డిక్వెల్లా (51) హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచారంటేనే అర్థం చేసుకోవచ్చు.. భారత బౌలర్లు ఎంత ధాటిగా బౌలింగ్ చేశారో. అశ్విన్, మహ్మద్ షమీ, స్టార్ ఆల్‌రౌండర్ జడేజా చెలరేగడంతో పర్యాటక జట్టుకు ఘోర పరాభవం తప్పలేదు.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏@ImRo45 begins his Test captaincy stint with a win as #TeamIndia beat Sri Lanka by an innings & 2⃣2⃣2⃣ runs in the first @Paytm #INDvSL Test in Mohali. 👌 👌
Scorecard ▶️ https://t.co/XaUgOQVg3O pic.twitter.com/P8HkQSgym3
— BCCI (@BCCI) March 6, 2022
ఇక టీమిండియా విషయానికొస్తే అల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో 175 పరుగులు..బౌలింగ్‌లో తొమ్మిది వికెట్లతో రాణించి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. స్వదేశీ పిచ్‌లపై తన బౌలింగ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో 13 ఓవర్లు వేసిన జడేజా 41 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో 16 ఓవర్లు వేసి 46 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇక రెండో టెస్టు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా మార్చి 12 నుంచి జరగనుంది.
ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి టెస్టు స్కోర్లు:
ఇండియా తొలి ఇన్నింగ్స్ – 574/8 డిక్లేర్డ్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్- 174 పరుగులు ఆలౌట్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్- 178 పరుగులు ఆలౌట్
🎥 🎥 That moment when @ashwinravi99 picked the landmark 4⃣3⃣5⃣th Test wicket 👏 👏 #TeamIndia | #INDvSL | @Paytm pic.twitter.com/RKN3IguW8k
— BCCI (@BCCI) March 6, 2022
The smile on @imVkohli‘s face says it all.#TeamIndia give him a Guard of Honour on his landmark Test.#VK100 @Paytm #INDvSL pic.twitter.com/Nwn8ReLNUV
— BCCI (@BCCI) March 5, 2022
‘Rockstar’ @imjadeja 👏👏@Paytm #INDvSL pic.twitter.com/JG25othE56
— BCCI (@BCCI) March 5, 2022