5 అడుగుల 4 అంగుళాల ఎత్తు,
రింగులు తిరిగిన జుట్టు,
ప్రశాంతంగా కనిపించే మొహం,
చేతిలో వజ్రాయుధాన్ని తలపించే ఓ క్రికెట్ బ్యాట్,
అలా ఆయన క్రీజ్ లోకి వస్తుంటే భారతీయుల హృదయాలు పులకించిపోయేవి.
ఆ దేవుడి పేరే సచిన్ రమేశ్ టెండూల్కర్!
100 కోట్ల మంది భారతీయుల కలలని, అంచనాలని.. 24 సంవత్సరాల పాటు చిరునవ్వుతో భరించిన ఆ క్రికెట్ దేవుడికి.. ఒక అంపైర్ ఆగ్రహాన్ని తెప్పించాడు. ఎంతలా అంటే.. తనలో ఆవేశం కట్టలు తెంచుకునేంతలా! అంతలా ఏమి జరిగింది అనేగా మీ సందేహం.. అయితే ఇది చదివేయండి.
అది.. 2007 ఫ్యూచర్ కప్ సిరీస్. ఇండియా, సౌంతాఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్. ఐర్లాండ్ వేదికగా మ్యాచులు. మొదటి వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించగా, రెండో వన్డేలో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా పోటీస్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ 31 ఓవర్లకు కుదించారు. ఏబీ డివిలియర్స్, వ్యాన్ విక్ క్రీజులోకి వచ్చారు. 6 పరుగుల వద్ద అజిత్ అగార్కర్.. వ్యాన్ విక్ డకౌట్ గా పెవిలియన్ బాట పట్టాడు. తరువాత క్రీజులోకి జాక్వెస్ కల్లిస్ సైతం.. అజిత్ అగార్కర్ బౌలింగ్ లో డకౌట్ గా వెనుతిరిగాడు. 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ప్రోటీస్ జట్టు కష్టాల్లో పడింది.
Aleem Dar Worst Umpiring pic.twitter.com/usMPXrIrZH
— Govardhan Reddy (@gova3555) July 28, 2022
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హర్షల్ గిబ్స్, డివిలియర్స్ కు జత కలిసాడు. బంతి అందికున్న జహీర్ ఖాన్ చక్కటి బ్యాక్ అఫ్ లెన్త్ అవుట్ సైడ్ ఆఫ్ బాల్ వేస్తాడు. దాన్ని అంచనా వేయడంలో బోల్తా పడ్డ ఏబీ, స్లిప్ లో ఉన్న సచిన్ కు క్యాచ్ ఇస్తాడు. చక్కటి క్యాచ్ అందుకున్న సచిన్, జట్టులోని ఇతర ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకుంటుండగా.. అంపైరింగ్ చేస్తున్న అలీమ్ దార్ మాత్రం నాటౌట్ అన్నట్లుగా ప్రకటిస్తాడు. అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఆటగాళ్లందరూ అతని వైపు సీరియస్ గా చూస్తారు. సచిన్ ఇదేం.. అంపైరింగ్ అన్నట్లుగా అతని వైపు దూసుకెత్తాడు. ఈ ఘటన అప్పట్లో బాగా చర్చనీయాంశంమైంది. ఆరోజుల్లో డీఆర్ఎస్ రివ్యూలు ఉండేవి కాదు. అంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం.
— Govardhan Reddy (@gova3555) July 28, 2022
ఇక ఆ మ్యాచ్ విషయానికొస్తే.. మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. 31 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేస్తుంది. అనంతరం భారత జట్టు.. 30.2 ఓవర్లో లక్ష్ట్యాన్ని ఛేదిస్తుంది. 3వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంటుంది. మాన్ అఫ్ ది మ్యాచ్ యువరాజ్ సింగ్ అందుకోగా, మాన్ అఫ్ ది సిరీస్ సచిన్ అందుకుంటాడు. సచిన్ 90 పరుగుల పైబడి ఉన్నప్పుడు కూడా అంపైర్ల తప్పుడు నిర్ణయాలతో ఎన్నో సార్లు అవుట్ గా పరిగణించపడ్డాడు. అలాంటి సందర్భాల్లో కూడా సచిన్ ఎదురు చెప్పకుండా ఎంతో కూల్‌గా పెవిలియన్ కు వెళ్లిపోయేవాడు. అలాంటి క్రికెట్ దేవుడికి సైతం.. పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్, తన తప్పుడు నిర్ణయంతో ఆగ్రహాన్ని తెప్పిస్తాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sachin vs Olonga: కూల్‌గా ఉండే సచిన్‌కు ఆ రోజు కోపం వచ్చింది! గ్రౌండ్‌లో విధ్వంసమే జరిగింది!