పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు అద్భుత విజయాలు సాధించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంటోంది. ఇటీవల ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ చేజిక్కించుకున్న రోహిత్ సేన.. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా సేమ్ సీన్ రిపీట్ చేసింది. గుహవటి వేదికగా జరిగిన భారత్-దక్షిణాఫ్రికా రెండో టీ20లో 16 పరుగుల తేడాతో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. అయితే.. ఈ విషయాన్ని పక్కకు పెట్టిన అభిమానులు కోహ్లీని పొగడడమే పనిగా పెట్టుకున్నారు. ‘సచిన్ టెండూల్కర్ స్వార్థపరుడు.. కోహ్లీ నిస్వార్థపరుడు..’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఎప్పుడో 19 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనను అందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
సచిన్ టెండూల్కర్.. సాధారణ ప్రజానీకం దేవుడిని ఎలా పూజిస్తారో.. క్రికెట్ ప్రేమికులు సచిన్ ను అలా భావిస్తారు. వేలల్లో పరుగులు.. వందల్లో సెంచరీలు చేసిన సచిన్.. ఏనాడు రికార్డుల కోసం పాకులాడింది లేదు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. ఇది సచిన్ అంటే. కానీ, కొందరు కోహ్లీ అభిమానులు సచిన్ ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకు 2003లో గుహవటి వేదికగా జరిగిన ఇండియా- శ్రీలంక మ్యాచును ఉదాహరణగా చూపుతున్నారు. ఆ మ్యాచులో సచిన్ 96 పరుగులతో నాటౌట్ గా నిలుస్తాడు. వాస్తవంగా చెప్పాలంటే.. సచిన్ సెంచరీ కానివ్వకుండా దినేష్ కార్తీక్ అడ్డుపడతాడు. దీంతో ఆగ్రహానికి గురైన సచిన్.. డీకేని ఏదో అన్నట్లుగా అప్పట్లో వార్తలు ప్రసారమయ్యాయి. ఈ సంఘటనను నిన్న డీకే- కోహ్లీ మధ్య జరిగిన సంఘటనకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు వైరలవుతున్నాయి.
Pic1 : SachinTendulkar Angry On DK For Not Letting Him Complete His Century When Sachin Tendulkar Was Batting On 96*
Pic2: Virat Kohli Telling DK to Carry on Scoring Boundaries and Not Take A Deliberate Single When Virat was batting on 49*🙇❤@DineshKarthik ❤️
#INDvsSA pic.twitter.com/FlBtBAZPVa
— VR (@VinayKiccha_) October 2, 2022
హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండిపోతే ఎంత బాధగా ఉంటుంది. ఆ టైంలో స్ట్రైక్ చేస్తున్న బ్యాటర్… ఒక్క పరుగు చేసి ఇస్తాను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకో అని చెబితే ఎవరు కాదంటారు. కానీ కోహ్లీ కాదన్నాడు.. అందుకే ఈ పేరు మార్మోగుతోంది. అది చివరి ఓవర్.. విరాట్ 28 బంతుల్లో 49 పరుగులతో ఆడుతున్నాడు. బెస్ట్ ఫినిషర్ గా పేరున్న దినేశ్ కార్తిక్ స్ట్రైకింగ్ కి వచ్చాడు. మొదటి నాలుగు బంతులాడిన డీకే.. ఒక ఫోర్, సిక్స్ తో పది పరుగులు రాబట్టాడు. చివరి రెండు బంతులు మిగిలి ఉండగా.. నాన్ స్ట్రైక్లో ఉన్న కోహ్లి వద్దకు వెళ్లి స్ట్రైక్ కావాలా.. అని అడిగాడు. ‘వద్దు.. నీ స్టయిల్ లో నువ్ ఆడు..’ అని కోహ్లీ చెప్తాడు. దీన్ని సాకుగా తీసుకున్న కోహ్లీ అభిమానులు ‘నిజమైన నిస్వార్థపరుడు..’ అంటూ కోహ్లీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. సచిన్ ను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
Similar thing happened in 2009 (Tendulkar 96*)
‘DK no worries; our team has won an important match, that is the most satisfying thing for me. Personal goals have lesser meaning,’ and I was truly relieved. Sachin is such a total team man.
~ Dinesh Karthikpic.twitter.com/o38cGJf5ea https://t.co/jswEj7sDN4
— Cricketopia (@CricketopiaCom) October 3, 2022
Virat Kohli on 49* to Dinesh Karthik – continue with hitting boundaries.#Selflesspic.twitter.com/HyvEI9fEIq
— Cricketopia (@CricketopiaCom) October 3, 2022