ఇండియాలో క్రికెటర్లకున్న క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అభిమాన క్రికెటర్ ని ఒకసారి ప్రత్యక్షంగా చూస్తే చాలు అనుకునే అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అలాంటిది కలిసే అవకాశం వస్తే.. ఎగిరి గంతేస్తారు కదా! ఇది సాధారణ ప్రజానీకం చేసే పని. అదే నువ్వొక ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేరుగా కలవొచ్చు. ఇలానే ఓ ఐపీఎస్ కేడర్ ఆఫీసర్ టీమిండియా సారధి రోహిత్ శర్మను ప్రత్యక్షంగా కలిశాడు. అంతటితో ఊరుకున్నాడా! లేదు. దాన్ని కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్టుపై.. నానా రభస చేస్తున్నారు అభిమానులు.
ఆదివారం గుహవటి వేదికగా ఇండియా- దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో భారత జట్టు 16 పరుగుల తేడాతో జయకేతనం ఎగరవేసి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ పట్టేసింది. అయితే.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు అస్సాం డీసీపీ పొంజిత్ దోవరా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఫోటో దిగారు. అందుకు సంబంధించిన ఫోటోను పొంజిత్ దోవరా ట్విటర్ లో షేర్ చేశారు. “ఆల్ ది బెస్ట్ రోహిత్, కచ్చితంగా సెంచరీ సాధించాలి” అంటూ దానికి క్యాప్షన్ కూడా జతచేశారు. ఏదో క్రికెటర్ తో ఫోటో దిగాను కదా! సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామంటూ.. ఆయన చూపిన అత్యుత్సాహం అభిమానులకు ఒక వార్తలా మారింది.
Best of luck. Ek century ban ta hein. @ImRo45 pic.twitter.com/SDsZMF1fY0
— Ponjit Dowarah (@ponjitdowarah) October 1, 2022
ఈ పోస్ట్ పై అభిమానులు భిన్న కామెంట్లు చేస్తూ.. నానా రకాలుగా వాడేస్తున్నారు. ఇక రోహిత్ హేటర్స్ చేస్తున్న రచ్చ గురుంచి చెప్పక్కర్లేదు. ఓ నెటిజెన్.. ‘నా ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మను అరెస్టు చేయవద్దు’ అంటూ కామెంట్ చేయగా, మరో నెటిజెన్.. ‘రోహిత్ ఎందుకు సీరియస్ గా ఉన్నావు? అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారా?’ అంటూ కామెంట్ చేశాడు. డీసీపీ పోస్ట్ చేసిన ఫొటోలో రోహిత్ సీరియస్ గా ఉండటమే అందుకు కారణం. ఇప్పటికే.. వేలకొద్దీ లైకులు, వందల కొద్దీ కామెంట్లతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Evaru adigina ayana kotadu unkol pic.twitter.com/O8sO1HEW6b
— Manojkumar (@Manojkumar_099) October 1, 2022
— 𝐃𝐇𝐑𝐈𝐓𝐈𝐌𝐀𝐍 (@DhritimanGogoi4) October 3, 2022