భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య సిరీస్ డిసైడర్ మ్యాచ్ నేడు(మంగళవారం) ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరుజట్లు 1-1తో సమవుజ్జీలుగా ఉన్నాయి. దీంతో కేప్ టౌన్‌లో జరగనున్న మూడో టెస్టులో గెలిచిన జట్టు సిరీస్ విజేతగా నిలవనుంది. టీమిండియాకు ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ విజయం లేదు. దీంతో ఎలాగైన మూడో టెస్టులో విజయం సాధించిన సిరీస్ విజయం లోటును తీర్చాలని కోహ్లీ సేన బలంగా ఫిక్స్ అయింది. అలాగే ఈ టెస్టులో పలు రికార్డులకు వేదిక కానుంది.
కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియన్ గ్రేట్ కెప్టెన్ స్టీవ్ వాతో సమానంగా నిలిచే అవకాశం విరాట్ కోహ్లీకి ఉంది. స్టీవ్ వా కెప్టెన్‌గా 41 టెస్టులు గెలిచాడు. అతనిని సమం చేయడానికి విరాట్ కోహ్లి కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లి కేప్ టౌన్ టెస్టులో గెలిస్తే దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కడంతో పాటు స్టీవ్ వాతో సమానంగా నిలుస్తాడు. దీంతో పాటు కేప్ టౌన్ టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్‌గా కూడా ప్రత్యేక విజయాన్ని సాధించగలడు. కేప్‌టౌన్‌లో విరాట్ కోహ్లి 146 పరుగులు చేస్తే, టెస్టు క్రికెట్‌లో 8000 పరుగులు పూర్తి చేస్తాడు. ఇది మాత్రమే కాదు, అతను 2 క్యాచ్‌లు తీసుకుంటే, టెస్ట్ క్రికెట్‌లో 100 క్యాచ్‌లు పూర్తవుతాయి.
The stage is set for the final showdown in the Test series. 😎💪🏻
It’s Match Day! 🥳#PlayBold #TeamIndia #SAvIND pic.twitter.com/HbjkS7fkBV
— Royal Challengers Bangalore (@RCBTweets) January 11, 2022
అలాగే రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీస్తే, కుంబ్లే తర్వాత అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా కపిల్ దేవ్‌ను అధిగమించనున్నాడు. ప్రస్తుతం అశ్విన్ టెస్టు క్రికెట్‌లో 430 వికెట్లు, కపిల్ దేవ్ 434 వికెట్లు తీశారు. పుజారా కూడా దిలీప్ వెంగ్‌సర్కార్‌ను వెనక్కు నెట్టే అవకాశం ఉంది. కేప్‌టౌన్‌లో 8 పరుగులు చేసిన తర్వాత, పుజారా దిలీప్ వెంగ్‌సర్కార్ 6668 పరుగులను దాటతాడు. అలాగే పుజారా టెస్టుల్లో 7000 పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది. అజింక్యా రహానే 79 పరుగులు చేసిన వెంటనే టెస్టు క్రికెట్‌లో 5000 పరుగులు పూర్తి చేస్తాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా నిలవనున్నాడు. అంతే కాదు కేప్ టౌన్ టెస్టులో రహానే క్యాచ్ తీసుకుంటే 100 క్యాచ్‌లు కూడా ఈ ఫార్మాట్‌లోనే పూర్తవుతాయి.
🔊 🔊 🔛
Practice 🔛
𝐈𝐧 𝐭𝐡𝐞 𝐳𝐨𝐧𝐞 – 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐊𝐨𝐡𝐥𝐢.👌 👌#TeamIndia | #SAvIND | @imVkohli pic.twitter.com/ChFOPzTT6q
— BCCI (@BCCI) January 10, 2022
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొడితే దక్షిణాఫ్రికాపై 50 టెస్ట్ వికెట్లు తీసిన ఫీట్‌ను సాధిస్తాడు. అశ్విన్, హర్భజన్, అనిల్ కుంబ్లే మాత్రమే దక్షిణాఫ్రికాపై 50 టెస్టు వికెట్లు తీశారు. మరి ఈ రికార్డులన్నీ ఈ టెస్టులో నిజం అవుతాయని మీ భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ధోని నాకు చెప్పిన మాట.. నేను ఎప్పటికీ మర్చిపోలేను: కోహ్లీ