రేపు (ఆదివారం) భారత్ పాకిస్థాన్ జట్లు ఆసియా కప్ ఫైనల్ ఆడేందుకు రెడీ అయిపోయాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇండియా పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్ కి చేరిపోయాయి. అదేంటి ఆసియా కప్ స్టార్ట్ అవ్వడానికి ఇంకో నెల రోజులు టైం ఉందిగా అప్పుడే ఫైనల్ ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. కాకపోతే ఈ మ్యాచ్ జూనియర్ క్రికెటర్లు ఆడబోతున్నారు. భారత్ ఏ తో పాకిస్థాన్ ఏ జట్టు తలపడబోతుంది. ప్రస్తుతం కుర్రాళ్ళు తలపడనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆసియా కప్ ఎమర్జింగ్ క్రికెట్ లో భాగంగా పాకిస్థాన్ శ్రీలంక ని చిత్తు చేస్తే..నిన్న జరిగిన సెమి ఫైనల్ మ్యాచులో టీమిండియా బంగ్లాదేశ్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. అద్భుత ఫామ్ లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య టైటిల్ పోరు జరగడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఫైనల్ గురించి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
సీనియర్లు ఆడినా, జూనియర్లు, ఉమెన్స్ అని తేడా లేకుండా ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ ని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మ్యాచ్ ని ఫ్యాన్ కోడ్ లో లైవ్ చూడొచ్చు. ప్రస్తుతం యంగ్ స్టార్లు ఫ్యూచర్ టీమిండియా జట్టులో ఎంట్రీ ఇవ్వడానికి ఈ మ్యాచ్ చక్కని అవకాశం గా మారనుంది. యాష్ ధూల్ కెప్టెన్సీలో టీమిండియా జట్టు చాలా బలంగా ఉంది. ఓపెనర్లు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ మంచి ఆరంభాలు ఇస్తుంటే కెప్టెన్ యాష్ దూల్ వాటిని భారీ స్కోర్లుగా మలుస్తున్నారు. ఇక హర్షిత్ రానా నేతృత్వంలో బౌలింగ్ పటిష్టంగా ఉంది. ఇక పాక్ జట్టును చూసుకుంటే అన్ని విభాగాల్లో సమతుల్యంగా కనిపిస్తుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచులో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొత్తానికి ఈ ఆదివారం అభిమానులకి కిక్ ఇవ్వడానికి భారత్, పాక్ రెడీ అయిపోయాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.