ప్రస్తుతం ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో బీజీగా ఉన్న టీమిండియా జట్లు.. అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం షెడ్యూల్ ఖారైంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ నవంబర్ 13వ తేదీన ముగుస్తుంది. ఆ వెంటనే 18 నుంచి న్యూజిలాండ్, భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ కోసం ఆసీస్ వెళ్లే జట్టే.. అటునుంచి అటే న్యూజిలాండ్ వెళ్లే అవకాశం ఉంది.
మ్యాచ్‌ల వివరాలు..
తొలి టీ20 – 18 నవంబర్ రాత్రి 7.30 గంటలకు, విల్లింగ్టన్(వేదిక)
2వ టీ20 – 20 నవంబర్ రాత్రి 7.30 గంటలకు, మౌంట్ మౌంగానుయ్
3వ టీ20 – 22 నవంబర్ రాత్రి 7.30 గంటలకు, నేపియర్
తొలి వన్డే – 25 నవంబర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి, ఆక్లాండ్
రెండో వన్డే – 27 నవంబర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి, హామిల్టన్
చివరి వన్డే – 30 నవంబర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి, క్రైస్ట్‌చర్చ్
Bring on summer! 🏏🌞https://t.co/RaRLaNmQZb
— Cello Basin Reserve (@BasinReserve) June 28, 2022