భారీ ఆశలతో ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టిన భారత జట్టుకు భంగపాటు తప్పలేదు. టీమిండియా సారథి రోహిత్ శర్మ గైర్హాజరీలో ఇంగ్లాండుతో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టుకు మరో దారుణ ఓటమి ఎదురైంది. నాలుగో రోజు ఆటలో ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్‌స్టో ఇద్దరూ ఇదో రోజు సెంచరీలతో చెలరేగారు. ఆఖరి రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్, బెయిర్‌స్టో దంచి కొట్టారు. ఎడాపెడా బౌండరీలతో ఇద్దరూ చెలరేగడంతో భారత బౌలర్లు చేతులెత్తేశారు. అయితే.. నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్ ను హనుమ విహారి మిస్ చేయడమే భారత ఓటమికి కారణమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, హైదరాబాదీ క్రికెటర్ హనుమ విహారి అభిమానుల ఆగ్రహానికి బలవుతున్నాడు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన ఇదో టెస్టులో ఇండియా ఓటమికి విహారియే కారణమని ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. బ్యాటింగ్ లో పెద్దగా రాణించని అతడు.. కీలక సమయంలో బెయిర్ స్టో క్యాచ్ మిస్ చేయడమే అందుకు కారణమని వాపోతున్నారు.
Hanuma vihari dropped catch of Jonny bairstow. #hanumavihari #Vihari dropped catch of #JonnyBairstow #INDvsENG #INDvENG pic.twitter.com/YVp40t0zNs
— Shribabu Gupta (@ShribabuG) July 5, 2022
అసలు ఏం జరిగిందంటే..
378 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు. అయితే.. కీలక సమయంలో 107-0తో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ 109కి 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జానీ బెయిర్ స్టో.. 14 పరుగుల వద్ద ఉండగా మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఉన్న హనుమా విహారి జారవిడచాడు. అసలే ఫుల్ ఫామ్ లో ఉన్న బెయిర్ స్టో వంటి ఆటగాడు ఇచ్చిన క్యాచ్ ను నేలపాలు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందనేది ఇండియాకు త్వరగానే తెలిసొచ్చింది. క్యాచ్ మిస్ తర్వాత వచ్చిన అవకాశంతో బెయిర్ స్టో(114).. జో రూట్(142) తో కలిసి వీరవిహారం చేశాడు. ఇంగ్లాండ్ ను విజయతీరాలకు చేర్చాడు.
Wtf hanuma vihari. U fucked up real this time.। Run nahi banaye. Catch toh le le. U just lost the match bro. #ENGvsIND
— Rahul suri (@Asklepias199029) July 4, 2022
ఇది కూడా చదవండి: Jonny Bairstow: ఇంగ్లాండ్ నయా స్టార్ జానీ బెయిర్‌స్టో లవర్ ఎవరో తెలుసా?
దీంతో ఈ హైదరాబాదీ క్రికెటర్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘ఈ టెస్టులో టీమిండియా ఓడిందంటే దానికి కారణం నువ్వే.. ముందుగా అట్టర్ ఫ్లాఫ్ బ్యాటింగ్ షో ఒకవైపు, మరోవైపు కీలకమైన బెయిర్ స్టో క్యాచ్ మిస్ చేశావ్..’ అంటూ విహరిని తిట్టిపోస్తున్నారు.
the main reason for losing last test match.. Hanuma vihari batting and main catch drop of bairstow..
Virat kohli poor performance.
After playing with no 10 batsman jadeja is playing dot ball only… And shreyas iyer.And indian management not to pick ashwin in place of shardul— vivek (@vandv01) July 5, 2022
ఇది కూడా చదవండి: IND vs ENG: టెస్టులో టీ20 తరహా బ్యాటింగ్ చేసిన జో రూట్!
అయితే.. ఈ మ్యాచులో టీమిండియా ఓటమికి సమిష్టి వైఫల్యమే కారణమని చెప్పాలి. రిషబ్ పంత్,రవీంద్ర జడేజా, బుమ్రా.. మినహా ఎవరూ రాణించిందిలేదు. తొలి ఇన్నింగ్స్ లో శుభమన్ గిల్, పుజారా, హనుమా విహారి, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ చేసిన పరుగులు 76.. రెండో ఇన్నింగ్స్ లో ఇదే జాబితాలో పుజారా ఒక్కడే కాస్త మెరుగ్గా (66) ఆడాడు. మిగిలినవారిది అదే పంథా. మిగతా నలుగురు రెండో ఇన్నింగ్స్ లో చేసిన రన్స్ 54. ఇక ఆల్ రౌండర్ స్థానంలో అశ్విన్ స్థానంలో వచ్చిన శార్దూల్ ఠాకూర్ చేసిన పరుగులు 5.. తీసిన వికెట్లు 1. అలాగే.. బుమ్రా, సిరాజ్, షమీలతో కూడిన భారత త్రయాన్ని ఇంగ్లాండ్ బ్యాటర్లు అలవోకగా దంచికొట్టారు. మరి..టీమిండియా ఓటమిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.