ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్ భారత జట్టు.. ఇప్పుడు వన్డేలపై కన్నేసింది. పేస్ కు అనుకూలించే ఓవల్ పిచ్ పై టీమిండియా పేసర్లు ఇంగ్లాండ్ బ్యాటర్ల భారతం పట్టారు. ముఖ్యంగా బూమ్ బూమ్ బుమ్రా ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికించాడు. బుమ్రా, షమీ ద్వయం.. నువ్వా, నేనా! అన్నట్లు పోటీపడీ మరీ వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 110 పరుగులకే చాపచుట్టేసింది. అందులో నలుగురు బ్యాటర్లు గుండు సున్నాకు పరిమితమయ్యారు.
టెస్టుల్లో తమదైన స్టైల్ ల్లో బైటటింగ్ చేసి.. దూకుడుగా ఆడటాన్నితమ లక్షణంగా మార్చుకున్నామని విర్రవీగుతున్న ఇంగ్లాండ్ కు అసలైన దూకుడు ఎలా ఉంటుందో రుచి చూపించారు.. భారత బౌలర్లు. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ కు ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే షాకిచ్చాడు బుమ్రా. తను వేసిన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (0), జో రూట్ (0)ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. ఆ తర్వాత కూడా సత్తా చాటాడు. ఈ మధ్యలో మహమ్మద్ షమీ కూడా మరో ఎండ్ నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ బెన్ స్టోక్స్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఆపై వెంటవెంటనే టెస్టు హీరో జానీ బెయిర్‌స్టో (7)ను, విధ్వంసకర ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ (0)ను బుమ్రా..పెవిలియన్ చేర్చాడు. దీంతో 27 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
#ENGvsIND 1st ODI | England all out at 110 against India at Kennington Oval, London (Jos Buttler 30, Jasprit Bumrah 6-19, Mohammed Shami 3-31). This is England’s lowest ODI score against India.
(Pic: BCCI Twitter) pic.twitter.com/HEDMDb2yhT
— ANI (@ANI) July 12, 2022
కష్టాలలో ఉన్న ఇంగ్లాండును కెప్టెన్ బట్లర్ (30), మొయిన్ అలీ (14) కాసేపు ఆదుకునే ప్రయత్నం చేసారు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ ఈ జోడీని విడగొట్టాడు. ప్రసిధ్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చిన అలీ నిరాశగా వెనుదిరిగాడు. కాసేపటికే బట్లర్‌ను షమీ పెవిలియన్ చేర్చాడు. చివర్లో డేవిడ్ విల్లే (21), బ్రైడన్ కార్సె (15) కాసేపు పోరాదినప్పటకీ ఫలితం లేకపోయింది. మరోసారి బంతి అందుకున్న బుమ్రా.. కార్సేను, విల్లేను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 25.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 110 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా మొత్తం ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అతడి బౌలింగ్ సగటు.. 2.60 గా నమోదవడం విశేషం. షమీ 3 వికెట్లతో సత్తా చాటగా.. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీసుకున్నాడు. భారత బౌలర్ల ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jasprit Bumrah’s 6/19. One of the best spell in recent times, absolutely amazing! pic.twitter.com/0gZ4DJ8oFe
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2022
ఇది కూడా చదవండి: Sunil Gavaskar: కోహ్లీ, పంత్‌పై గవాస్కర్ ఆగ్రహం.. వారి కాంట్రాక్ట్ డిమోట్ చేయండి!
ఇది కూడా చదవండి: IND vs ENG: కోహ్లీకి మరో ఎదురు దెబ్బ! ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు దూరం!