బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టు సిరీస్‌లు ఆడేందుకు రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా బంగ్లాదేశ్ వెళ్లింది. శుక్రవారమే బంగ్లాదేశ్ చేరుకున్న భారత బృందం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. తిరిగి జట్టులో చేరారు. రేపు(ఆదివారం) ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో భారత్-బంగ్లా తొలి వన్డే ఆడనున్నాయి. ఇదే స్టేడియంలో రెండో వన్డే డిసెంబర్ 7న జరగనుంది. ఇక చివరి వన్డే చిట్టగాంగ్‌లో డిసెంబర్ 10న జరగనుంది. భారత కాలమానం ప్రకారం మూడు వన్డేలు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి.
అయితే.. ఈ సిరీస్‌కు సంబంధించిన మ్యాచ్‌లేవీ హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్టీమింగ్ కావడంలేదు. దీంతో క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ల లైవ్ ఎలా చూడాలని కంగారు పడకండి. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లను జియో టీవీ యాప్ ద్వారా ఉచితంగా చూడొచ్చు. అలాగే సోనీ టీవీ నెటవర్క్ ఈ సిరీస్‌లకు ప్రధాన బ్రాడ్‌కాస్ట్‌గా ఉంది. దీంతో సోనీ టెన్1, 2, 3, 4 ఛానెల్స్‌లో ప్రత్యక్షప్రసారం చూడొచ్చు. అలాగే డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌ను కూడా వీటిలో చూడొచ్చు. 14 నుంచి 18 వరకు చిట్టగాంగ్ వేదికగా తొలి టెస్ట్, డిసెంబర్ 22-26 వరకు ఢాకా వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. రెండు టెస్ట్‌ల ఉదయం 9.30కు ప్రారంభం కానున్నాయి.
ఈ సిరీస్‌లో అందరి కళ్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మపైనే ఉన్నాయి. ఇటివల ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2022లో ఈ ఓపెనింగ్ జోడీ దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో టీమిండియా కనీసం సెమీస్ అయినా చేరగలిగింది. కానీ.. మిగతా జట్టు విఫలం అవ్వడంతో వరల్డ్ కప్‌లో భారత్ తన స్థాయి ప్రదర్శన చేయలేదు. వరల్డ్ కప్ తర్వాత జరిగిన న్యూజిలాండ్ టీ20, వన్డే సిరీస్‌లకు రోహిత్, రాహుల్‌కు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ వీరిద్దరూ బంగ్లాతో సిరీస్‌లో ఆడుతున్నారు. ఇక్కడైన పరుగులు చేసి తిరిగి ఫామ్ అందుకుంటారో? లేదో? అని భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. వన్డే సిరీస్‌కు సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ గాయంతో దూరమయ్యాడు. అతని స్థానంలో స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌ను జట్టులోకి వచ్చాడు.
Ind🇮🇳 vs Ban🇧🇩 1st ODI starts from 4th Dec, 2022 at 11:30AM.
Shere Bangla National Stadium, Mirpur, Bangladesh.
Live only on Sony Sports & Sony liv#BANvIND #SonyLIV #SonySportsNetwork pic.twitter.com/WBFtujT1tu— Deepak Reddy (@DeepakR21576732) December 2, 2022