టీ20లు.. కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇది విడదీయలేని అనుబంధం. మిగతా ఫార్మాట్ల సంగతి పక్కనబెడితే.. ఇందులో రోహిత్ శర్మది మాస్టర్ మైండ్. ఐపీఎల్ లో ఇప్పటికే ముంబయి ఇండియన్స్ కి కెప్టెన్ గా ఉంటూ, ఐదు ట్రోఫీలు సొంతం చేసుకున్నాడు. టీమిండియాని కూడా అదే రూట్ లో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ తనది మాస్టర్ మైండ్ అనేలా ప్లానింగ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లోనూ ఇలాంటి విషయం ఒకటి కనిపించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మొహాలీ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20లో భారత్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. కేఎల్ రాహుల్ 55, సూర్యకుమార్ యాదవ్ 46, హార్దిక్ పాండ్య 71 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఫించ్-గ్రీన్ జోడీ అదిరిపోయే ఆరంభం ఇచ్చింది. ఓవైపు ఫించ్ 22 పరుగులు చేసి ఔటయ్యాడు. గ్రీన్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశాడు. అలాంటి గ్రీన్, రోహిత్ వేసిన స్కెచ్ కి దొరికిపోయాడు.
10 ఓవర్లలోనే 109 పరుగులతో విజయంవైపు ఆసీస్ దూసుకెళ్తోంది. ఇదే ఊపు కొనసాగిస్తే గెలవడానికి ఎంతసేపు పట్టదు. అలాంటి సమయంలో రోహిత్, తన మాస్టర్ మైండ్ ని అప్లై చేశాడు. అక్షర్ పటేల్ కి బౌలింగ్ అప్పగించాడు. గ్రీన్ కి లెగ్ సైడ్ లో బంతులేస్తే బాదేస్తున్నాడని, ఆఫ్ సైడ్ బంతులు వేయాలని సూచించాడు. ఓవర్ల మధ్య దొరికిన బ్రేక్ టైములో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ ద్రవిడ్ వచ్చి అక్షర్ తో ఈ విషయాన్ని చర్చించారు. సరిగ్గా ఇలానే చేసిన అక్షర్.. 10.1 బంతిని ఆఫ్ సైడ్ వేశాడు. ఆ బాల్ ని గ్రీన్, బలంగా కొట్టినప్పటికీ లాంగాన్ లో ఉన్న కోహ్లీ.. క్యాచ్ ని ఒడిసిపట్టాడు. దీంతో గ్రీన్ పెవిలియన్ చేరక తప్పలేదు. ఈ ఒక్కటి చాలు రోహిత్, టీ20ల్లో ఎలాంటి మాస్టర్ మైండో చెప్పడానికి.. మరి రోహిత్ ప్లానింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
— Hardin (@hardintessa143) September 21, 2022
ఇదీ చదవండి: ఆ ఒక్క వికెట్ తీసుంటే రిజల్ట్ మరోలా ఉండేది: కెప్టెన్ రోహిత్