తొలి వన్డే విజయంతో లీడ్ సాధించింది టీమిండియా. అయితే విశాఖ వన్డేలో మాత్రం తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయింది. మొదటి వన్డే మాదిరిగానే రెండో వన్డేలో కూడా టీమిండియా బ్యాటర్స్ స్టార్క్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో విఫలం అయ్యారు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. ఇప్పటికే తొలి వన్డే విజయంతో లీడ్ సాధించింది టీమిండియా. అయితే విశాఖ వన్డేలో మాత్రం తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయింది. మొదటి వన్డే మాదిరిగానే రెండో వన్డేలో కూడా టీమిండియా బ్యాటర్స్ స్టార్క్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో విఫలం అయ్యారు. తొలి బంతి నుండే నిప్పులు చెరిగిన స్టార్క్.. తొలి ఓవర్ నాలుగో బంతికే గిల్ ను అవుట్ చేసి తన జట్టుకి శుభారంభాన్ని అందించాడు. తరువాత రోహిత్ తో జతకట్టిన కోహ్లీ.. స్టార్క్ ను ధైర్యంగానే ఎదుర్కొన్నా.. వరుస బంతుల్లో రోహిత్, సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ చేరడంతో భారత్ మరింత కష్టాల్లో పడిపోయింది. ఈ ఇద్దరినీ కూడా స్టార్క్ పెవిలియన్ కు చేర్చడం విశేషం.
ఈ క్రమంలోనే 32 పరుగులకే 3 వికెట్స్ పడ్డ దశలో బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్ తొలుత బాగానే కుదురుకున్నట్టు కనిపించాడు. నిజానికి తొలి వన్డేలో టీమ్ కి విజయాన్ని అందించడంతో.. ఈ మ్యాచ్ లో కూడా రాహుల్ రాణించడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ.., స్టార్క్ అద్భుతమైన డెలివరీతో రాహుల్ ను అవుట్ చేసి.. తన ఖాతాలో నాలుగో వికెట్ వేసుకున్నాడు. మరో ఎండ్ లో సీన్ అబాట్ కూడా అద్భుతమైన బంతులు సంధిస్తూ రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాని అవుట్ చేసి టీమిండియాని కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇలా ఆసీస్ బౌలర్ల విజృంభణతో ప్రస్తుతం ఇండియా 80 పరుగులకే 6 వికెట్స్ కోల్పోవాల్సి వచ్చింది.
50 పరుగులు కూడా చేయకుండానే ఇండియా టాప్ ఆర్డర్ అంతా అవుట్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కోహ్లీ- జడేజా ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు. 31 పరుగులు చేసిన కోహ్లీ ని నాథన్ ఎలీస్ అవుట్ చేశాడు. నిజానికి లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లును ఆడటంలో టీమిండియా టాప్ ఆర్డర్ ఎప్పుడూ విఫలం అవుతూనే వస్తోంది. వన్డే వరల్డ్ కప్ కు ఎంతో సమయం లేని ఈ తరుణంలో కూడా మన టాప్ ఆర్డర్ ఈ సమస్యని అధిగమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
India 49 for 5 in Vizag, What a catch by Smith.
— Johns. (@CricCrazyJohns) March 19, 2023