ఆస్ట్రేలియాతో జరగబోయే WTC ఫైనల్ కి భారత్ జట్టుని ప్రకటించేశారు. జట్టులో ఒకటి రెండు మార్పులు మినహా స్వదేశంలో ఈ ఏడాది ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడిన భారత జట్టునే ఎంపిక చేశారు. జట్టుని ఒకసారి చూసినట్లయితే...
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఐపీఎల్ హడావుడే కనిపిస్తుంది. అయితే ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో WTC ఫైనల్ ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్ లో జూన్ 7 న ఒవెల్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో WTC ఫైనల్ ఆడబోయే భారత క్రికెట్ జట్టుని ప్రకటించేశారు. 15 మందితో కూడిన స్క్వాడ్ ని తాజాగా బీసీసీఐ తెలియచేసింది. గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా జట్టుని కూడా ఈ ఫైనల్ కోసం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మ్యాచ్ మీద భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో భారత జట్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
గత కొంత కాలంగా టీమిండియా WTC ఫైనల్ జట్టు ఎలా ఉండబోతుంది అనే అనుమానం అందరిలో ఉంది. పంత్ లేడు, అయ్యర్ కి ఈ మధ్యనే సర్జరీ జరిగింది. సూర్య, రాహుల్ ఫామ్ లో లేరు. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు వెటరన్ అజింక్య రహానేకు టెస్టు జట్టులో స్థానం కల్పించారు. ఐపీఎల్ లో అదరగొడుతున్న రహానే ఇటీవలే టీమిండియాలోకి తీసుకురావాలనే డిమాండ్ బాగా వినిపించింది. అనుకున్నట్లుగానే రహానేకు స్థానం దక్కగా.. పేలవ ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ మీద వేటు పడింది. ఇక కీపర్ గా కేఎస్ భారత్ కి కొనసాగగా.. కేఎల్ రాహుల్ కి మరో అవకాశం దక్కింది. బౌలర్ల విషయానికి వస్తే శార్దూల్ ఠాకూర్ నాలుగో సీమర్ గా చోటు దక్కించుకున్నాడు. రోహిత్ టీమిండియాని లీడ్ చేయనున్నాడు.
WTC ఫైనల్ ఆస్ట్రేలియాతో ఆడబోయే 15 మందిని చూసుకున్నట్లైతే.. రోహిత్ శర్మ(కెప్టెన్ ),గిల్ , రాహుల్ , కోహ్లీ ,రహానే ,పుజారా , కేఎస్ భరత్(వికెట్ కీపర్) , జడేజా , అశ్విన్, అక్షర్ పటేల్, షమీ , సిరాజ్ , శార్దూల్ ఠాకూర్ , ఉమేష్ యాదవ్, ఉనాద్కట్. మరి ఈ స్క్వాడ్ కి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.