ఆ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేం.. ఆ మ్యాచ్ టికెట్ల అమ్మకమే చెప్తుంది క్రేజ్ అంటే ఏంటో. ఇండియా-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ గురించే అని మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో ఐసీసీ ఈవెంట్లలోనే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. వరల్డ్ కప్ లాంటి వేదికలపై ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే.
అందుకే ఈ ఏడాది అక్టోబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ టికెట్లు విక్రయం ప్రారంభించింది. ఇండియా-పాకిస్థాన్ గ్రూప్ దశ మ్యాచ్ అక్టోబర్ 23న జరగనుంది. ఆ మ్యాచ్ టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన నిమిషాల్లోనే అయిపోయాయి. దీంతో మరోసారి ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి నెట్టింట చర్చ నడుస్తుంది. మరి ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.