న్యూజిలాండ్ తో జరుగుతు సిరీస్ లో టీమిండియా దుమ్మురేపుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్ లోనూ చెలరేగిపోతుంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20లో మెుదట భారత బ్యాటర్లు చెలరేగారు. శుభ్ మన్ గిల్ మరో సారి తన మార్క షోతో ఆకట్టుకోగా.. త్రిపాఠి అలరించాడు. దాంతో కివీస్ ముందు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది భారత్. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. నిప్పులు చెరిగే బంతులతో కివీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించారు. భారత బౌలర్ల దాటికి 12. 1 ఓవర్లలోనే 66 పరుగులకు కుప్పకూలింది కివీస్. దాంతో భారత్ 168 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
పాండ్యా, అర్షదీప్ చెలరేగడంతో కేవలం 21 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు న్యూజిలాండ్ టీమ్. టీమిండియా బౌలర్లు అయిన హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ లకు తోడు స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్ సైతం అద్భుతమైన బౌలింగ్ తో కివీస్ నడ్డి విరిచారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కు తొలి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు టీమిండియా సారథి హార్దిక్ పాండ్యా. ఓపెనర్ ఫిన్ అలెన్ ను ఇన్నింగ్స్ 0.5వ బంతికే అవుట్ చేశాడు. అద్భుతమైన క్యాచ్ తో అలెన్ ను పెవిలియన్ కు పంపాడు సూర్య కుమార్ యాదవ్.
Ridiculous catch by Surya.pic.twitter.com/8HKwzmj0r5
— Johns. (@CricCrazyJohns) February 1, 2023
ఆ తర్వాత అర్షదీప్ కివీస్ నడ్డి విరిచాడు. ఒకే ఓవర్లో కాన్వే(1), మార్క్ చాప్ మన్(0)లను అవుట్ చేశాడు. క్రీజ్ లోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్ కూడా 2 పరుగులకే అవుటైయ్యాడు. ఇక ఆదుకుంటాడు అనుకున్న బ్రేస్ వెల్(8) పరుగులకే ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యి నిరాశపరిచాడు. శాంట్నర్ (13) పరుగులతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న క్రమంలో శివం మావి అతడిని అవుట్ చేయడం ద్వారా కివీస్ పతనాన్ని శాసించాడు. ఇదే ఓవర్ లో ఇష్ సోథీని సైతం మావి వెనక్కి పంపించాడు. తర్వాత వచ్చిన పెర్గూసన్(0), టిక్నర్(1), లిస్టర్(0) లు వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో 168 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ క్రమంలోనే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది భారత జట్టు. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4 వికెట్లతో న్యూజిలాండ్ ఓటమిని శాసించగా.. మిగతా వారిలో అర్షదీప్, మాలిక్, మావిలు తలా రెండు వికెట్లు తీశారు.
An overwhelming victory of 168 runs for India 🇮🇳
With this India claims the three-match T20I series by 2-1 🏆#CricTracker #INDvNZ #ShubmanGill #T20I pic.twitter.com/4ar2a78vXq
— CricTracker (@Cricketracker) February 1, 2023
A famous Kiwi collapse, 54 for 8 in Ahmedabad.
— Johns. (@CricCrazyJohns) February 1, 2023