టీమిండియా మాజీ క్రికెటర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఈయన.. తాజాగా మరణించారు. దీంతో సచిన్ సహా పలువురు క్రికెటర్లు సంతాపం తెలియజేస్తున్నారు.
టీమిండియాలో విషాదం! ఓవైపు ఐపీఎల్ తో క్రికెటర్లు, ఫ్రాంచైజీలు అన్నీ బిజీగా ఉన్నాయి. ఇలాంటి టైంలో భారత మాజీ ఓపెనర్ మృతి చెందారనే వార్త అందరినీ కలచి వేసింది. దిగ్గజ సచిన్ తో సహా మాజీలు చాలామంది ఈ క్రికెటర్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముంబయి నుంచి వచ్చి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత కాలంలో ముంబయి సెలక్షన్ కమిటీ ఛైర్మన్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ గా పనిచేశారు. దీంతో స్టార్స్ నుంచి మాజీల వరకు తన సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే… భారత మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్ (78) గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ముంబయి ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాయక్.. ముంబయి క్రికెట్ లో చాలా గౌరవమైన వ్యక్తి. రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. అతడి సారథ్యంలోనే అంటే 1970-71 సీజన్ లో రంజీ టైటిల్ ని గెలుచుకుంది. ఆ ఏడాది సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే ముంబయి కప్ గెలుచుకోవడంతో నాయక్ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు.
1972లో ముంబయి స్టార్ బ్యాటర్లు జట్టులోకి తిరిగి రావడంతో.. నాయక్ ని ప్లేయింగ్ XI నుంచి తప్పించారు. 1974లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన జట్టులో సుధీర్ నాయక్ ఉన్నారు. బర్మింగ్ హామ్ టెస్టుతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. మూడు టెస్టులు మాత్రమే ఆడారు. మరోవైపు 85 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 35 కంటే ఎక్కువ సగటుతో 4376 పరుగులు చేశారు. ఇందులో డబుల్ సెంచరీతో పాటు ఏడు శతకాలు ఉన్నాయి. క్రికెటర్ గా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కోచ్ గా మారిపోయారు. జహీర్ ఖాన్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి సుధీర్ నాయక్ కారణమని చెప్పొచ్చు. ముంబయి తీసుకొచ్చి జహీర్ కు కోచింగ్ ఇచ్చింది ఈయనే. ఆ తర్వాత ముంబయి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా, వాంఖడే స్టేడియం క్యూరేటర్ గానూ పనిచేశారు. ఇప్పుడు ఇలా అనారోగ్యంతో మరణించి అందరికీ బాధని మిగిల్చారు.
My heartfelt condolences to Shri Sudhir Naik ji’s family and friends. His contributions to cricket will always be remembered. May his soul rest in peace.
— Sachin Tendulkar (@sachin_rt) April 5, 2023