వన్డే వరల్డ్ కప్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. అప్పటికే టీమిండియా స్టార్ బ్యాటర్లు చెలరేగారు. టీమిండియాకు భారీ స్కోర్ అందించారు. అయినా కూడా ఓటమి తప్పలేదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య.. మ్యాచ్ చివరి బంతికి ఫలితం తేలింది. కీలక మ్యాచ్‌లో అదృష్టం మొఖం చాటేయడంతో మిథాలీ సేన వరల్డ్ కప్ నుంచి ఇంటిముఖం పట్టింది. భారత్‌పై సౌత్‌ఆఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53), కెప్టెన్ మిథాలీ రాజ్(68), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 48 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మెరుగైన స్కోరు సాధించింది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్ రెండు, అయబోంగా ఒకటి, ట్రియాన్‌కు ఒకటి, మసబాట క్లాస్ రెండు వికెట్లు పడగొట్టారు. ఆరంభంలోనే దక్షిణాఫ్రికా ఓపెనర్ లిజెలీ లీను హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్ చేయడంతో భారత్‌కు మంచి బ్రేక్ వచ్చింది. కానీ మరో ఓపెనర్ లారా వొల్వార్డ్ 80 పరుగులు సాధించి పటిష్ట పునాది వేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన లారా గుడాల్ సైతం 49 పరుగులు సాధించగా.. కీలక సమయంలో మిగ్నన్‌డు ప్రీజ్ 52 పరుగులతో రాణించి అజేయంగా నిలిచింది.మరోవైపు.. వరుస విరామాల్లో వికెట్లు పడటంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి.
ముఖ్యంగా ఈ టోర్నీలో తొలిసారి బౌలింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ వికెట్లు తీస్తూ.. రనౌట్లలో భాగం కావడం ముచ్చటగొలిపింది. హర్మన్ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు భారత్ పోరాడగలిగింది. అయితే, 49.5వ ఓవర్లో దీప్తి శర్మ నోబాల్ వేయడంతో భారత్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతికి డు ప్రీజ్ సింగిల్ తీయడంతో భారత్ పరాజయం ఖరారైంది. దీంతో టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. గత వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన భారత్.. ఈ సారి సెమీస్ కూడా చేరలేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కెప్టెన్‌గా జడేజా తత్తరపాటు! ధోకికే కోపం తెప్పించాడు
🚨 RESULT | #MomentumProteas WIN BY 3 WICKETS
🇿🇦 A 125-run second-wicket partnership between Laura Wolvaardt (80) and Lara Goodall (49) set the innings up as Mignon du Preez (52*) saw the team over the line
📷 ICC/Getty#INDvSA #CWC22 #BePartOfTheForce #AlwaysRising pic.twitter.com/7NKMDUhKsL
— Cricket South Africa (@OfficialCSA) March 27, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.