అండర్ 19 వరల్డ్ కప్‌లో టీమిండియా కుర్రాళ్లు అదరగొడుతున్నారు. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీస్‌లో భారత్ కుర్రాళ్లు భారీ విజయం సాధించారు. దీంతో వరుసగా నాలుగో సారి అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌లో అడుగుపెట్టారు. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. కెప్టెన్ యష్ ధుల్(110) సెంచరీతో, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్(94) పరుగులతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 290 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను టీమిండియా స్పిన్నర్లు 194 పరుగులకే కుప్పకూల్చారు.కాగా అండర్-19 వరల్డ్ కప్‌లో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020 తర్వాత ఈ ఏడాది కూడా టీమిండియా ఫైనల్ చేరింది. ఇప్పటివరకు నాలుగు సార్లు భారత్ అండర్19 విశ్వవిజేతగా అవతరించింది. 2000, 2008, 2012, 2018లో భారత్ ప్రపంచకప్ గెలిచింది. ఈ సారి ఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. మరి భారత్‌ను ఇంగ్లండ్‌ను ఓడించి ఐదో సారి కూడా విశ్వవిజేతగా నిలుస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India Won by 9️⃣6️⃣ Runs.
They’ve been absolutely clinical, have India, and the Aussies were never in the chase.#INDvAUS #INDvsAUS #U19CWC #U19CWC2022 #TeamIndia #IndianCricketTeam #CricketTwitter #Cricket pic.twitter.com/IdqLZZvkra
— ProBatsman (@probatsman) February 2, 2022