మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారీ సెంచరీ చేశాడు. 228 బంతుల్లో 17 పొర్లు, 3 సిక్సర్ల సహాయంతో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే డబుల్ సెంచరీకి జడేజా 25 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేయడంపై వివాదం చెలరేగింది. కెరీర్‌లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇన్నింగ్స్ ఎలా డిక్లేర్ చేస్తారని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు .
2004లో భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ లో పర్యటించింది. ఈ సిరీస్ లో భారత టెస్టు జట్టుకు రాహుల్ ద్రవిడ్ నాయకత్వం వహించాడు. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచులో కూడా ఇలాంటి సీన్ జరిగింది. సెహ్వాగ్(309) పరుగులతో పాక్ గడ్డపై ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అదే మ్యాచ్‌లో సచిన్ కూడా 194 పరుగుల వద్ద ఉండగా ద్రవిడ్ డిక్లేర్డ్ అని ప్రకటించాడు. ఈ అంశంపై అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ గా ఉండి అలా చేశాడు. ఇవాళ హెడ్ కోచ్ పదవిలో ఉన్నాడు కాబట్టి ఇది కూడా ద్రావిడే చేపించాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.
#jadeja 🤝 Sachin
Dravid pic.twitter.com/xLhmfWtdur
— Shivani (@meme_ki_diwani) March 5, 2022
కాగా.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీలతో కలిసి ఆరు, ఏడో, తొమ్మిదవ వికెట్లకు.. 100 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. గతంలో వినోద్ కాంబ్లీ, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, కరణ్ నాయర్ పేరిట ఈ ఫీట్ నమోదైంది.
After Rahul Dravid’s controversial declaration when Sachin was at 194* in Multan(2004)
this is the most controversial declaration when jadeja innings is at 175* in Mohali(2022)
Rohit should’ve given 3-4 ovrs to Jadeja to complete his rare Double Century..#Dravid #Jadeja #Rohit pic.twitter.com/NmBNenBX3p— Hemant Shardul (@HeyShardul) March 5, 2022