ఆసియా కప్2022 లో ఓటమి.. తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో తొలి టీ20లో ఓటమి.. దాంతో ఈ ఆటతో టీ20 వరల్డ్ కప్ గెలవడం కష్టమే! అని అందరు మాజీలు అభిప్రాయపడ్డారు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని త్వరలోనే రుజువు చేసింది టీమిండియా. రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ లోనే ఉంది. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆసిస్ ను చిత్తు చేసి సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అదీ కాక చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ రికార్డును సైతం బద్దలు కొట్టింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సూర్యకుమార్ మెరుపులు.. కోహ్లీ క్లాస్ బ్యాటింగ్ కు తోడు అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలింగ్ తోడైన వేళ 3వ టీ20 లో ఆసిస్ ను భారత్ చిత్తు చేసింది. ఆదివారం హైద్రాబాద్ వాసులకు అసలైన వినోదం లభించింది. దాంతో ఆస్ట్రేలియాను భారత్ 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంతో దాయాది దేశమైన పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. ఆ రికార్డు ఏంటంటే? పాక్ ఒకే సంవత్సరం(2021)లో అత్యధిక విజయాలు (20) సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పగా.. ఆ రికార్డును తాజాగా భారత్ బద్దలు కొట్టింది. 2022లో భారత్ 21 అంతర్జాతీయ టీ20ల్లో విజయం సాధించింది. ఈ సంవత్సరం టీమిండియా మెుత్తం 29 టీ20లు ఆడగా అందులో 21 మ్యాచ్ ల్లో గెలిచింది.
అదీ కాక ఈ సంవత్సరం జరిగిన 14 అంతర్జాతీయ సిరీస్ ల్లో 11 సిరీస్ లను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ గెలవడంతో టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. రాబోయే సౌతాఫ్రికా సిరీస్, టీ20 వరల్డ్ కప్ లో కూడా ఇదే విధంగా రాణించాలని భావిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెుదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా గ్రీన్ 21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 52 పరుగులు, టిమ్ డేవిడ్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్ లతో 54 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ లు ఆడటంతో ఆసిస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 రన్స్ చేసింది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ 33/3తో మరోసారి మెరిశాడు.
అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పో యి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ కేవలం 36 బాల్స్ లోనే 5 ఫోర్లు, 5 సిక్స్ లతో 69 పరుగులు చేయగా.. కింగ్ కోహ్లీ 48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ లతో 63 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సామ్స్ 33/2 తో రాణించాడు. థండర్ ఇన్నింగ్స్ ఆడిన SKYకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించగా.. సిరీస్ లో 8 వికెట్లతో సత్తా చాటిన అక్షర్ పటేల్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు. మరి ఈ మ్యాచ్ గెలవడం ద్వారా పాక్ రికార్డును బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
𝐂. 𝐇. 𝐀. 𝐌. 𝐏. 𝐈. 𝐎. 𝐍. 𝐒 🏆#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/5yk3bRnHiV
— BCCI (@BCCI) September 25, 2022
Virat Kohli becomes second highest scorer for india in intl.
Rohit wins 9th consecutive series as captain. Win % – 100
India have won a record 21 T20I games in 2022
Surpassed PAK’s record of 20 winsSKY has hit most sixes in a calendar year (42) equalled Rizwan’s record.
— Aadvik (@thecoolguy03) September 25, 2022