పాకిస్తాన్‌తో ఆదివారం జరగబోయే మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 13 బంతులు మిగిలిఉండగానే చేధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ(60 పరుగులు రిటైర్డ్‌హర్ట్) అర్థశతకంతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ 38, కేఎల్ రాహుల్ 39 పరుగులతో అదరగొట్టారు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి మ్యాచ్‌ను తన స్టైల్లో ముగించాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 57 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. ఆఖర్లో స్టోయినిస్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 2, రాహుల్ చహర్, భువనేశ్వర్ కుమార్, జడేజా తలా ఒక వికెట్ తీశారు. ఆడిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా ఇక తమ బలం, బలహీనతలను విశ్లేషించుకుని పాక్‌తో మ్యాచ్‌లో అదరగొట్టేందుకు ప్యూహాలు రచించనుంది. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించగా విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయడం విశేషం.