ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో ప్రారంభం కానున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022లో హాట్ పేవరేట్ ఇవే అంటూ ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రకటించాడు. అందులోనూ ఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియా తలపడతాయని జోస్యం చెప్పాడు. ఇండియా, ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్ కూడా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుందని అన్నాడు. కాగా.. వరల్డ్ కప్ నెగ్గేందుకు ఆట మాత్రమే ముఖ్యం కాదని కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
పాంటింగ్ మాట్లాడుతూ.. ‘భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌లో తలపడతాయని నేను భావిస్తున్నాను. ఫైనల్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాకు హోం గ్రౌండ్లో ఆడటం కలిసొచ్చే అంశం. గత టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా యూఏఈలోనూ విజయాన్ని సాధించింది. అది హోం కంట్రీ కాదు. అయినా ఆస్ట్రేలియా ఓ మధురమైన విజయాన్ని దక్కించుకుంది. ఐపీఎల్ కారణంగా యూఏఈ పరిస్థితులపై ఆస్ట్రేలియన్లకు కూడా కొంత అవగాహన వచ్చిన మాట వాస్తవమే. అందువల్ల అక్కడ గెలవడానికి ఒక మార్గాన్ని కనుగొంది’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.
కాగా.. పాంటింగ్ చెప్పినట్లు ఆస్ట్రేలియాలకు వారి స్వదేశంలో టోర్నీ జరగడం కలిసొచ్చే అంశమే అయినా.. టీమిండియా స్థాయికి తగ్గట్లు ఆడితే గ్రౌండ్ ఏదైనా లెక్కలోకి రాదు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు.. ముఖ్యంగా కుర్రాళ్లు ఉన్న ఫామ్‌ను చూస్తే వరల్డ్ కప్‌లో టీమిండియాను హాట్ ఫేవరేట్‌గా చెప్పవచ్చు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ అందుకుంటే టీమిండియా ఫుల్‌లోడెడ్ గన్‌లా గ్రౌండ్‌లోకి దిగుతుంది. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. టీమిండియాకు వచ్చే ఆత్మవిశ్వాసమే వేరు ఆ ఊపులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఇలా ఏ జట్టునైనా ఓడించే సత్తా టీమిండియా సొంతం. మరి టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విజయావకాశాలు, రికీ పాంటింగ్ జోస్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Do you agree with Ricky Ponting’s picks for the ICC Men’s @T20WorldCup 2022? 🏆
More ➡️ https://t.co/hbZ38x7BKw pic.twitter.com/oyjRGZbE6e
— ICC (@ICC) July 27, 2022