”టెస్ట్ క్రికెట్ ను అభిమానులు ఎగబడి చూసేలా చేస్తాం” పాక్ టెస్ట్ సిరీస్ కు బయలుదేరేముందు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండమ్ మెక్ కల్లమ్ అన్న మాటలు ఇవి. చాలా మంది ఈ మాటలను నీటి మీద రాతలుగా కొట్టిపారేశారు. కానీ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక కానీ తెలియలేదు మెక్ కల్లమ్ మాట్లాడింది మాటలు కాదు తూటాలు అని. అన్నట్లుగానే ఇంగ్లాండ్ బ్యాటర్లు పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. తొలి రోజే 506 పరుగుల రికార్డు స్కోర్ ను నమోదు చేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? దానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం టీమిండియా మూడు వన్డే సిరీస్ మ్యాచ్ లో భాగంగా ఆదివారం (డిసెంబర్ 4)న తొలి వన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో టాపార్డర్ ఘోరంగా వైఫల్యం చెందింది. దాంతో టీమిండియా 186 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో టీమిండియా భయపడుతూ బ్యాటింగ్ చేయడమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పవర్ ప్లే లో ఇంగ్లాండ్ టెస్టుల్లో కొట్టినట్టు కూడా ఇండియా ఆడలేదు.
గత కొన్నిరోజులుగా టీమిండియా ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. బౌలింగ్, బ్యాటింగ్ రెండిట్లో అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శల పాలవుతుంది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి వన్డేలో అత్యంత చెత్త బ్యాటింగ్ తో కేవలం 186 పరుగులకే కుప్పకూలింది. గత కొన్నిరోజులుగా టీమిండియాపై వస్తోన్న ప్రధాన విమర్శ బ్యాటింగ్ చేయడంలో టీమిండియా బ్యాటర్లు భయపడుతున్నారు అని. దానికి నిదర్శనం ప్రస్తుతం బంగ్లాతో జరిగిన తొలివన్డేనే. ఈ మ్యాచ్ లో టీమిండియా 7 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే చేసి ఓ వికెట్ ను సైతం కోల్పోయింది. అయితే ఇదే క్రమంలో అటు పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 7 ఓవర్లలో 2 వికెట్లకు 46 పరుగులు చేసింది. దీన్ని బట్టే అర్దం అవుతోంది టీమిండియా ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారో అని.
Two formats. Two different approaches 🤔#BANvIND #PAKvENG pic.twitter.com/aXeDAlmf9b
— ESPNcricinfo (@ESPNcricinfo) December 4, 2022
ఇక మెున్న ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 ప్రపంచ కప్ లో సైతం టీమిండియా బ్యాటర్లు ఒత్తిడికి లోనై.. భయపడుతూనే ఆడారు. పసికూన జింబాబ్వేపై కూడా భారత ఆటగాళ్లు పరుగులు చేయడంలో తెగ ఇబ్బంది పడ్డారు. ఇక బంగ్లాతో జరిగిన తాజా మ్యాచ్ లో సైతం బంగ్లా బౌలర్లను ఎదుర్కొవడంతో పూర్తిగా విఫలం అయ్యారు. దాంతో టీమిండియా బ్యాటింగ్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు అభిమానులు. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ ను టీ20లా ఆడుతుంటే.. టీమిండియా మాత్రం వన్డేలను టెస్టుల్లా ఆడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
KL Rahul is the only positive for India with the bat.#BANvIND | @klrahul pic.twitter.com/SBiXMJk3iM
— CricTracker (@Cricketracker) December 4, 2022
మీరు ఇంగ్లాండ్ జట్టును చూసి నేర్చుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విశ్రాంతి తర్వాత జట్టులోకి వచ్చిన విరాట్, రోహిత్ లు దారుణంగా విఫలం అయ్యారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెుదట బ్యాటింగ్ చేసిన టీమిండియా బంగ్లా స్టార్ బౌలర్ షకిబ్ అల్ హసన్ దాటికి కుప్పకూలింది. 41.2 ఓవర్లలో 186 పరుగులకే తోకచుట్టేసింది. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒక్కడే రాణించాడు. అతడు 70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 73 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ (27), అయ్యర్(24), వాషింగ్టన్ సుందర్ (19)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. బంగ్లా బౌలర్లలో షకిబ్ అల్ హసన్ 5 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఎబ్డాట్ హోస్సేన్ 4 వికెట్లతో సత్తా చాటాడు.
Shakib Al Hasan and Ebadot Hossain share nine wickets between them.#BANvIND pic.twitter.com/MROdx0lOpf
— CricTracker (@Cricketracker) December 4, 2022
A great start with the ball for Bangladesh at home. They restrict India to just 186 runs in the first ODI.#BANvIND pic.twitter.com/cVsGxIhtb0
— CricTracker (@Cricketracker) December 4, 2022