భారత్-ఆసీస్ మధ్య వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ధాటికి 117 పరుగులకే కుప్పకూలారు. దాంతో 20 ఏళ్లలో ఆసీస్ పై ఇదే చెత్తరికార్డుగా నమోదు అయ్యింది.
భారత్-ఆసీస్ మధ్య వైజాగ్ వేదికగా రెండో వన్డే జరుగుతోంది. వాతావరణ పరిస్థితి అనుకూలిస్తుందో.. లేదో అన్న అనుమానంతో ఈ మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఇక తొలి వన్డేలో గెలిచి మంచి ఊపుమీదున్న టీమిండియా.. అదే జోరును రెండో వన్డేలో చూపించాలని భావించింది. అయితే అనూహ్యంగా ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విఫలం అయ్యారు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్ల భరతం పట్టాడు. మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడికి తోడు సీన్ అబ్బాట్ సైతం 3 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనంలో తన వంతు పాత్ర వహించాడు. పేసర్ల దెబ్బకి భారత్ కేవలం 26 ఓవర్లకే 117 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
వైజాగ్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆసీస్ పేసర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోయారు. మరీ ముఖ్యంగా ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీమిండియా బ్యాటర్లకు చుక్కలు చూపెట్టాడు. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలం అవుతూ వస్తున్న భారత బ్యాటర్లు ఆ సంప్రదాయన్ని కొనసాగిస్తున్నారు. ఇక మ్యాచ్ వివరాల్లోకి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు తొలి ఓవర్ లోనే షాకిచ్చాడు మిచెల్ స్టార్క్. శుభ్ మన్ గిల్ ను అవుట్ చేయడం ద్వారా ఇండియా పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, రోహిత్ తో కలిసి ఇండియా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ మరోసారి స్టార్క్ భారత్ కు గట్టి షాక్ ఇస్తూ.. కెప్టెన్ రోహిత్ (13) పరుగులకే అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా క్రీజ్ లో నిలదొక్కుకోలేదు.
ఈ క్రమంలోనే ఆదుకుంటాడు అనుకున్న గత మ్యాచ్ హీరో కేఎల్ రాహుల్(9) పరుగులకే స్టార్క్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. సూర్యకుమార్ మరోసారి డకౌట్ గా వెనుదిరగగా.. పాండ్యా(1), జడేజా(16), కుల్దీప్(4), షమీ(0), సిరాజ్(0) ఘోరంగా విఫలం అయ్యారు. అక్షర్ పటేల్ ఒక్కడే 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఆసీస్ బౌలర్లలో మిచెట్ స్టార్ టీమిండియా పతనాన్ని ఒంటి చేత్తో శాసించాడు. కీలకమైన 5 వికెట్లు పడగొట్టి భారత నడ్డివిరిచాడు. అతడికి అండగా సీన్ అబ్బాట్ 3 వికెట్లతో రాణించాడు. అయితే గత 20 ఏళ్లలో ఆసీస్ పై భారత్ కు ఇదే చెత్త రికార్డు కావడం గమనార్హం. గతంలో 2003లో సెంచూరియన్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 125 పరుగులకే కుప్పకూలింది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత 117 పరుగులకు ఆలౌట్ అయ్యి చెత్తరికార్డును నమోదు చేసుకుంది. ఇక 2000లో సిడ్నీలో జరిగిన మ్యాచ్ లో సైతం టీమిండియా కేవలం 100 పరుగులకే కుప్పకూలింది. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా తక్కువ పరుగులకే కుప్పకూలడం జరిగింది. మరి టీమిండియా 117 పరుగులుకే కుప్పకూలడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
India has no clues for the Australian pace attack as they bowled out for 117 runs in the second ODI. Mitchell Starc was exceptional as he took his ninth five-wicket haul in ODIs.#MitchellStarc #INDvsAUS pic.twitter.com/2VkKXBXyzw
— CricTracker (@Cricketracker) March 19, 2023