భారత జట్టు ఓటమి భయంతోనే పాకిస్థాన్‌కు రావడం లేదని.. అది చెప్పకుండా ఏవో కుంటిసాకులు చెబుతుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ అంటున్నారు. మరి అందులో నిజమెంతా?
ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఈ దాయాదుల పోరుకు భారీ క్రేజ్ ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదనే విషయం తెలిసిందే. ఐసీసీ ఈవెంట్స్‌లో తప్పితే.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగదు. వరల్డ్ కప్‌లు కాకుండా ఆసియా కప్‌లోనూ ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఆసియా కప్ 2023 జరగనున్న నేపథ్యంలో మరోసారి భారత్-పాక్ మధ్య ఆసక్తికర పోరు చూడొచ్చని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ.. ఈ సారి ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరగనున్న నేపథ్యంలో టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేది లేదని బీసీసీఐ తెగేసి చెప్పేసింది.
కానీ.. భారత్ జట్టు పాకిస్థాన్‌కు రావాలని రిక్వెస్టులు, రాకుంటే ఇండియాలో జరిగే వరల్డ్ కప్‌కు తామూ రామని బెదిరింపుల ఇలా అన్నీ చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అయినా సరే బీసీసీఐ మాత్రం పాక్‌కు వచ్చేది లేదని, గట్టిగా మాట్లాడితే.. ఆసియా కప్ వేదికనే మార్చేస్తామని కుండబద్దలు కొట్టేసింది. దీంతో మొదటికే మోసం వస్తుందని భావించిన పీసీబీ.. ఏసీసీని ఆశ్రయించింది. పీసీబీ-బీసీసీఐ మధ్య పంచాయితీని తాజాగా ఏసీసీ తేల్చింది. ఆసియా కప్ 2023ను పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని ప్రకటించి, భారత్ ఆడే మ్యాచ్‌లను మాత్రం తటస్థ వేదికలపై నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో పాక్ వెళ్లకూడదనే పంతాన్ని బీసీసీఐ నెగ్గించుకుంది.
భారత జట్టు పాకిస్తాన్ వచ్చి ఆడితే.. భారీ ఆదాయం వస్తుందని ఆశపడ్డ పీసీబీకి నిరాశ మిగిలింది. కానీ, మిగతా టోర్నీ పాకిస్థాన్‌లోనే నిర్వహిస్తుండటంతో సర్లే గుడ్డిలో మెల్ల నయం అన్నట్లు పీసీబీ సరిపెట్టుకుంది. ఇక్కడితో ఆసియా కప్ 2023 పంచాయితీ ముగిసింది. కానీ, భారత జట్టు తమ గడ్డపై అడుగు పెట్టడం లేదనే బాధను పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. భారత్ భయపడుతుందంటూ అక్కసును వెల్లగక్కుతున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ మాట్లాడుతూ.. ‘భారత జట్టు పాకిస్థాన్ చేతిలో ఓడిపోతామనే భయంతోనే ఇక్కడి రావడం లేదని, భద్రతా కారణాలు అంటూ సాకులు చెబుతుంది’ అని అన్నాడు. ప్రస్తుతం ఇమ్రాన్ నజీర్ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అయినా.. మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో సెట్ చేస్తున్నారుగా అక్కడ చూసుకుందాం అంటూ ప్రతి సవాల్ విసురుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Imran Nazir makes a big statement on India’s decision of not travelling to Pakistan for Asia Cup 2023.#India #Pakistan #INDvsPAK #AsiaCup2023 pic.twitter.com/GzNqQKsgeL
— CricTracker (@Cricketracker) March 24, 2023