సీనియర్ల గైర్హాజరీతో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-0తో వెనుకంజలో వుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్ నాయకుడిగా వ్యవహరించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో అతడు గాయం కారణంగా దూరమవడంతో రిషబ్ పంత్‌ను సారథిగా ఎంపిక చేశారు. పంత్ కు.. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించిన అనుభవం ఉన్న ఉన్నా.. ఆ అనుభవం ఏమాత్రం సరిపోవట్లేదు. కెప్టెన్ గా బాధ్యతారాహిత్యమైన బ్యాటింగ్ ఆడుతున్న పంత్.. బౌలర్లను సమర్థవంతంగా ఉపయోగించడంలో పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో అసలు పంత్ కెప్టెన్‌గా పంత్ పనికొస్తాడా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
రికార్డు స్థాయిలో వరుసగా 12 టీ20ల్లో నెగ్గి ఫుల్ జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియాకు.. దక్షిణాఫ్రికా జట్టు ఓటమి రుచి చూపిస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో 5 బంతులు ఉండగా లక్ష్యాన్ని చేధించిన సౌతాఫ్రికా.. రెండో టీ20లో 10 బంతులు మిగిలిఉండగానే మ్యాచ్ ను ముగించింది. మ్యాచ్ ఓటమి అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ.. ‘మేము బ్యాటింగ్‌లో మరో 10, 15 పరుగులు ఎక్కువ చేయాల్సింది. మా బౌలర్లు తొలి 8 ఓవర్ల వరకు రాణించారు. భువీ అద్భుతంగా రాణించగా.. సపోర్టింగ్‌గా మిగతా ఫాస్ట్ బౌలర్లు తోడ్పడ్డారు. కానీ ఆ తర్వాత మేం మేము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది. క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తదుపరి గేమ్‌లో మేం మెరుగ్గా ఆడతామని ఆశిస్తున్నాం. మేం ఇక మిగిలిన మూడు గేమ్‌ల్లోనూ గెలవాలి.’ అని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నా.. రిషబ్ పంత్ తన కెప్టెన్సీతో చిన్నచిన్న మిస్టేక్స్ చేసి ఓటమికి కారకమయ్యాడంటూ నెట్టింట కామెంట్లు హోరెత్తుతున్నాయి.
Rishabh Pant not happy with spinners’ show
India lost the 2nd T20I against South Africa by four wickets to go 2-0 down in the five-match series.
READ: https://t.co/w0uLwGNQum#RishabhPant #INDvSA #cricket #INDvsSA pic.twitter.com/au2efsE8HL
— TOI Sports (@toisports) June 13, 2022
బౌలర్లను సరిగా ఉపయోగించుకోలేకపోతున్న పంత్..
రిషబ్ కెప్టెన్సీ వైఫల్యంలో ప్రధాన కారణం.. బౌలర్లను సరిగా వినియోగించుకోలేకపోవడమే. పిచ్ స్వభావాన్ని కనిపెట్టి బౌలర్లను ఛేంజ్ చేసే కెపాసిటీ పంత్‌కు లేనట్టు స్పష్టంగా అర్థమవుతోంది. స్వదేశంలో పిచ్ లు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయని తెలిసినా సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాడు. చాహల్, హర్షల్ పటేల్‌లను పూర్తిగా రాంగ్ టైంలో బౌలింగ్ చేయిస్తూ పంత్ మూల్యం చెల్లించుకున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ ప్రభావవంతంగా లేదని తెలిసినా పదేపదే అతనికి ఇస్తూ మ్యాచును చేజారుస్తున్నాడు. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లోనూ .. దినేష్ కార్తీక్ రావాల్సిన చోట అక్షర్ పటేల్‌ను పంపించడం చాలా విడ్డూరంగా అనిపిస్తోంది.
4️⃣/1️⃣3️⃣ in 4️⃣ overs.
A top-class performance by @BhuviOfficial, but it wasn’t enough for #TeamIndia to get over the line. #OrangeArmy #INDvSA pic.twitter.com/ZgY4MLjaPJ
— SunRisers Hyderabad (@SunRisers) June 12, 2022
బాధ్యతారాహిత్యమైన బ్యాటింగ్..
9 ఓవర్లకు టీమిండియా స్కోరు 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు. ఈ టైంలో వచ్చినా ఏ కెప్టెన్ అయినా క్రీజులో వీలయినంత సేపు తాను నిలబడాలని ఆలోచిస్తారు. మరో ఎండ్‌లో బ్యాటర్ ఉన్నప్పుడు తప్పకుండా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఆడతారు. కానీ రిషబ్ పంత్ బాధ్యతారాహిత్యమైన షాట్ ఎంపిక వల్ల 5 పరుగులకే పెవిలియన్ చేరాడు.
#RishabhPant the chief engineer for rash shots pic.twitter.com/5rSJTah3cZ
— akhilesh reddy (@akhil_996) June 12, 2022
అందరూ కెప్టెన్లేనా..
పంత్ ఫీల్డింగ్ సెట్ కూడా తన ఆలోచన మేరకు జరుగుతుందా అనేది డౌటే. ఐపీఎల్ లో కెప్టెన్సీ సేవలందించిన ప్లేయర్లు తమ అనుభవాన్ని ఇక్కడ చూపించాలని ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తోంది. ఫీల్డింగ్ సెట్ చేసేటపుడు మిగతా వాళ్ల ప్రమేయం ఎక్కువైనట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఇందులో ముఖ్యంగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పెత్తనం ఎక్కువైనట్లు కన్పిస్తోంది. తన కంటే సీనియర్లయిన ఇతర ప్లేయర్లను పంత్ అదుపులో పెట్టులేక వారికి తలొగ్గుతున్నట్లు కొందరు పేర్కొంటున్నారు. ఏదేమైనా రిషబ్ పంత్ కాస్త అయోమయానికి, గందరగోళానికి గురువుతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Should Hardik Pandya be captaining this India side?https://t.co/vwHD9HNsZV
— India Today Sports (@ITGDsports) June 13, 2022