ఇండోర్, హోల్కార్ స్టేడియం వేదికగా జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో సఫారీ ఆటగాళ్లు చెలరేగి ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 30 పరుగుల వద్ద కెప్టెన్ తెంబా బవుమా (3) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిలీ రోసో, డికాక్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. అయితే.. ఈ మ్యాచులో టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ సౌతాఫ్రికా బ్యాటర్ ని అవుట్ చేయకుండా ఆట పట్టించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ బ్యాటర్లు హోల్కార్ స్టేడియాన్ని హోరెత్తించారు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడుతూ భారత బౌలర్లను చుక్కలు చూపించారు. ఎప్పటిలానే దక్షణాఫ్రికా సారధి టెంబా బవుమా(8) తొందరగా అవుట్ కావడమే వారికి కలిసొచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిలీ రోసో, క్వింటన్ డికాక్ తో కలిసి దంచికొట్టడం షురూ చేశాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రోసో.. 48 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 7 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ మైలురాయి చేరుకున్నారు. మొత్తానికి 20 ఓవర్లు ముగిసేసరికి ప్రొటీస్ జట్టు 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.
Rossouw’s 🔝💯 helps 🇿🇦 put 227 on board!
C’mon boys, let’s fight back 💪#OneFamily #INDvSA @BCCI pic.twitter.com/4Igw74MzQy
— Mumbai Indians (@mipaltan) October 4, 2022
అయితే.. ఈ మ్యాచులో దీపక్ చాహర్ సౌతాఫ్రికా బ్యాటర్ ని టీజ్ చేశాడు. 16 ఓవర్ వేయడానికి బాల్ అందుకున్న చాహర్.. ట్రిస్టన్ స్టబ్స్ ని మన్కడ్ చేస్తా అన్నట్లుగా బెదిరించాడు. కాకుంటే.. అవుట్ చేయలేదు. ఈ ఘటనపై అభిమానులు భిన్న రకాలుగా కామెంట్స్ వెలువడుతున్నాయి. “ఐసీసీ రూల్ మార్చింది.. నీకు తెలియదా! అవుట్ చేయడం మానేసి ఆట పట్టిస్తావా! అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్ టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత జట్టు ఆడబోయే ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచులో గెలిచి సమం క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
Deepak Chahar warned the Non Striker to stay in the Crease 😮#INDvSA #INDvsSA #TeamIndia pic.twitter.com/bDiNh0DiM3
— SR Cricket Fantasy (@CricketFantasyS) October 4, 2022