IND vs SA: లక్నో వేదికగా భారత్ – సౌతాఫ్రికా మధ్య జరగనున్న తొలి వన్డేలో ప్టోటీస్ జట్టు భారీ టార్గెట్ నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్; 63 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసీన్ (74 నాటౌట్; 65 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఈ మ్యాచులో టీమిండియా ఆటగాళ్ల నిర్లక్ష్యం ఫీల్డింగ్‌లో కొట్టొచ్చినట్లు కనిపించింది. పలు క్యాచులు నేల పాలు చేశారు. అదే సమయంలో ఓ బాల్ బాయ్ పట్టిన ఓ క్యాచ్.. మ్యాచుకే హైలైట్ గా నిలుస్తోంది.
వర్షం అంతరాయం కారణంగా మ్యాచును 40 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు జానేమన్ మలన్(22; 42 బంతుల్లో, 3 ఫోర్లు), క్వింటన్ డికాక్ (48: 54 బంతుల్లో, 5 ఫోర్లు) మొదటి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అనంతరం జానేమన్ మలన్‌ను అవుట్ చేసి శార్దూల్ ఠాకూర్ ఇండియాకు మొదటి వికెట్ అందించారు. ఆపై వెంటవెంటనే.. కెప్టెన్ టెంబా బవుమా(8; 12 బంతుల్లో, 2 ఫోర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (0; 5 బంతుల్లో), క్వింటన్ డికాక్(8: 12 బంతుల్లో, 2 ఫోర్లు) 48545 అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 110 పరుగులుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసిన్ జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 106 బంతుల్లోనే 139 పరుగులు జోడించారు. దీంతో దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
— Richard (@Richard10719932) October 6, 2022
ఈ మ్యాచులో టీమిండియా ఆటగాళ్ల నిర్లక్ష్యం ఫీల్డింగ్‌లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రొటీస్ బ్యాటర్లిచ్చిన పలు క్యాచులు నేల పాలు చేశారు. ఫలితంగా మిల్లర్, క్లాసిన్ చెలరేగిపోయారు. వీరి జోడీని విడదీసేందుకు టీం ఇండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో ఓ బాల్ బాయ్ పట్టిన ఓ క్యాచ్.. మ్యాచుకే హైలైట్ గా నిలుస్తోంది. అగ్రశ్రేణి ఆటగాళ్లు క్యాచులు పట్టలేక నానా తంటాలు పడుతుంటే.. ఆ అబ్బాయి సింపుల్ గా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో మీమర్స్ పండగ చేసుకుంటున్నారు. ఇద్దరి క్యాచులు కంపేర్ చేస్తూ.. మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసున్నారు.
— Richard (@Richard10719932) October 6, 2022
Two ball two catch drop by siraj and bishnoi#IndvsSAodi #SAVSIND pic.twitter.com/CNcmS3QRru
— sanaya rajput (@viratkohl18) October 6, 2022
That guy took a great catch.#IndvsSAodi pic.twitter.com/blWWrn8zqw
— The MediaTainment (@Media_Tainment) October 6, 2022