కాన్పూర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ వికెట్ నష్టపోకుండా 129 పరుగులు సాధించింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 258/4 తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియా 345 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెరీర్ లో తొలి టెస్ట్ ఆడుతున్న అయ్యర్ శతకం సాధించడం విశేషం.
That will be Stumps on Day 2.
New Zealand 129/0, trail #TeamIndia by 216 runs.
Scorecard – https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/IvPs1Txzma
— BCCI (@BCCI) November 26, 2021
తరువాత తమ తొలి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కివీస్ కి ఓపెనర్లు యంగ్, టామ్ లాథం శుభారంభాన్ని అందించారు. రెండో రోజు మొత్తం 57 ఓవర్ల పాటు క్రీజ్ లో పాతుకుపోయిన వీరి జోడీ దిగ్విజయంగా 129 పరుగులు సాధించడం విశేషం. ఈ క్రమంలోనే యంగ్, టామ్ లాథం అర్ధ శతకాలను పూర్తి చేసుకున్నారు.
యంగ్ చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగా, టామ్ లాథం మాత్రం డిఫెన్స్ వైపే మొగ్గు చూపాడు. ఈ క్రమంలో చాలాసార్లు టామ్ లాథం అవుట్ అయ్యే ప్రమాదం నుండి బయటపడ్డాడు. వీరి జోడిని విడదీయడానికి కెప్టెన్ అజింక్యా రహానే ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
మూడో రోజు కూడా మన బౌలర్లు ఇలానే ప్రభావం చూపించకపోతే న్యూజిలాండ్ కి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. ఏ ఫస్ట్ టెస్ట్ లో ఎలాంటి ఫలితం వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి,
🗣️ 🗣️ @ShreyasIyer15 shares his thoughts on receiving the #TeamIndia Test cap from the legendary Sunil Gavaskar. #INDvNZ @Paytm pic.twitter.com/zneWVpjHek
— BCCI (@BCCI) November 26, 2021