కివీస్ పై 2-0 తేడాతో ఆల్రెడీ వన్డే సిరీస్ గెలిచేశాం. అయినా సరే టీమిండియా అస్సలు తగ్గట్లేదు. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఓపెనర్ గా సెంచరీలు, డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న గిల్.. మరోసారి హాఫ్ సెంచరీ చేశాడు. అతడికి తోడు అన్నట్లు రోహిత్ కూడా రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి అదిరిపోయే రీతిలో వికెట్ నష్టపోకుండా 151 పరుగులు చేసింది. దీంతో సోషల్ మీడియా అంతా కూడా రోహిత్-గిల్ బ్యాటింగ్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు.
ఇక విషయానికొస్తే.. స్వదేశంలో న్యూజిలాండ్ తో వన్డేల్లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. హైదరాబాద్, రాయ్ పూర్ వేదికగా జరిగిన తొలి రెండు వన్డేల్లో మన కుర్రాళ్లు అదరగొట్టారు. సమష్టి ప్రదర్శనతో అద్భుతమైన విజయాలు సాధించారు. ఇప్పుడు నామమాత్ర 3వ వన్డేలోనూ సాదాసీదాగా ఆడితే సరిపోతుంది. అయినా సరే భారత్ ఏ మాత్రం తగ్గట్లేదు. టాస్ ఓడిన బ్యాటింగ్ చేస్తున్న మన జట్టుకు భారత ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. దీంతో 18 ఓవర్లు పూర్తయ్యేసరికి అభేద్యంగా 151 పరుగులు చేసింది. మన ఓపెనర్లు ఊపు చూస్తుంటే.. ఈరోజు 450 పరుగులకు పైగా స్కోరు చేసేలా కనిపిస్తోంది.
Fifty and going strong!
Excellent half-century from @ShubmanGill 👌👌
1️⃣0️⃣0️⃣ comes up as well for the opening wicket.
Follow the match ▶️ https://t.co/ojTz5Rqp9H#INDvNZ | @mastercardindia pic.twitter.com/3Ygz7ZIkHI
— BCCI (@BCCI) January 24, 2023