ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా.. వాళ్లు సొంత సోదరులు అన్నట్లుగానే అభిమానులు చూస్తుంటారు. ఆగస్టు 15, 2020న ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అరగంట వ్యవధిలోనే సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ టీమిండియా తరఫున ఎన్నో గొప్ప భాగస్వామ్యాలను నెలకొల్పారు. ఇద్దరూ కలిసి ఎన్నో మ్యాచ్ లను గెలిపించారు. అలాంటిది వారి మధ్య ఐపీఎల్ సీజన్ రచ్చ లేపిన విషయం తెలిసిందే.
సురేశ్ రైనాను ఐపీఎల్ 2022 సీజన్ కు సీఎస్కే రిటైన్ చేసుకోకపోవడమే కాకుండా వేలంలోనూ కొనుగోలు చేయలేదు. అన్ సోల్డ్ ప్లేయర్ గా సురేశ్ రైనా మిగిలిపోయాడు. ఆ సమయంలో సీఎస్కే, సురేశ్ రైనా ఫ్యాన్స్ ఎంతే ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు రైనాని తీసుకోకపోవడానికి ఎంఎస్ ధోనీ కారణం అంటూ వార్తలు వచ్చాయి. అందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసింది లేదు.
తాజాగా లార్డ్స్ వేదికగా ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. టీమిండియా- ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్ చూసేందుకు వచ్చిన ధోనీ, రైనా స్టేడియంలో ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్నాళ్లకు తలా, చిన్న తలా కలవడంపై సీఎస్కే ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Great watching the boys in blue 🇮🇳 @harbhajan_singh @msdhoni pic.twitter.com/1UEGAzEG7R
— Suresh Raina🇮🇳 (@ImRaina) July 14, 2022
రెండో వన్డే మ్యాచ్ కు ఒక్క ధోనీ, రైనా మాత్రమే కాదు.. సచిన్, గంగూలీ, హర్భజన్ సింగ్ వంటి మాజీ దిగ్గజాలు లార్డ్స్ వేదికగా సందడి చేశారు. రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలనుకున్న భారత్ కు నిరాశ ఎదురైంది. 100 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం నమోదు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ టోప్లీ 6/24 కెరీర్ బెస్ట్ స్టాట్స్ నమోదు చేశాడు. ఇన్నాళ్లకు ధోనీ, రైనా కలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sachin Tendulkar and Sourav Ganguly together watching the match at Lord’s. pic.twitter.com/UN3nJmhkrp
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2022