టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. మరో అరుదైన ఘనత సాధించాడు. జట్టులో ఏడో స్థానంలో బ్యాటింగ్ కి దిగి ఒకే క్యాలెండర్ ఇయర్ లో రెండు శతకాలు నమోదు చేసిన నాలుగో టీమిండియా ప్లేయర్ గా జడేజా రికార్డుల కెక్కాడు. ఓవరాల్ గా జడేజా కెరీర్లో టెస్టుల్లో అతనికి ఇది మూడో శతకం కావడం విశేషం. ఎడ్జ్ బస్టన్ వేదికగా టీమిండియా- ఇంగ్లాండ్ రీషెడ్యూల్డ్ టెస్టులో జడేజా ఈ ఘనత సాధించాడు. జడేజా కంటే ముందు ఈ ఘనత సాధించిన టీమిండియా ఆటగాళ్లు.. కపిల్ దేవ్(1986), ఎంఎస్ ధోనీ(2009), హర్భజన్ సింగ్(2010) తర్వాత రవీంద్ర జడేజా(2022) ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ మొత్తం విఫలమవ్వగా మిడిల్ ఆర్డర్ లో పంత్ క్రీజులో నిలదొక్కుకుని 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 194 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. ఆ తర్వాత జాస్ప్రిత్ బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మొత్తం 16 బంతుల్లో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టెస్టుల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు(35) ఇచ్చిన చెత్త రికార్డును స్టువర్ట్ బ్రాడ్ సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లతో మెరిసాడు.
RAVINDRA JADEJA has his third Test Century 💪🦁
He may have slipped under Pant’s radar, but this has been a century for the ages .. 183 balls | 13 fours | #ENGvIND pic.twitter.com/fbSC3goiUX
— Cricbuzz (@cricbuzz) July 2, 2022
ఇంగ్లాండ్ సెకెండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. 6.3 ఓవర్లలో 2 వికెట్ల్ నష్టానికి 31 పరుగులు చేశారు. ఇంగ్లాడం ఇన్నింగ్స్ మొదలైన తర్వాత 3 ఓవర్లకు ఒకసారి వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. మళ్లీ 3.3 ఓవర్ల తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ ఆపక తప్పలేదు. 6.3 ఓవర్ల సమయానికి రూట్(2), ఓలీ పోప్(6) క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నారు. జడేజా సాధించిన ఈ అరుదైన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#ENGvIND 5th test, Day 2 | Ravindra Jadeja scores his third Test century, India at 373/8
(Source: BCCI) pic.twitter.com/FNEgxojgUJ
— ANI (@ANI) July 2, 2022