టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్-2022లో భాగంగా ప్రస్తుతం రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. టీమిండియా ఐదో టెస్టులో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసిన టీమిండియా.. బౌలింగ్ లోనూ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ జట్టు 38 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగారు. జానీ బెయిర్ స్టో కెరీర్లో మరో అర్ధ శతకం నమోదు చేశాడు. ఇప్పటివరకు ఒక్క బెయిర్ స్టో మినహా మరే ప్లేయర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక పోయారు.
మూడో రోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జానీ బెయిర్ స్టో Vs విరాట్ కోహ్లీలా అనిపించింది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. మహ్మద్ షమీ ఓవర్లో ఈ ఘటన జరిగింది. షమీ బాల్ వేయగా అది కాస్త బౌన్స్ అయ్యింది. ఆ బాల్ తర్వాత పిచ్ ని చూస్తూ బెయిర్ స్టో ఏదో కామెంట్ చేసినట్లు కనిపించాడు. ఆ తర్వాత కోహ్లీ కలగజేసుకుని ఏదో మాట్లాడాడు. అందుకు బెయిర్ స్టో కూడా సమాధానం చెప్పాడు.
Virat Kohli having some chat with bairstow 👀 pic.twitter.com/WOqvXrtT58
— 𝓓𝓇𝔧 (@im_dheeru_) July 2, 2022
ఆ తర్వాత కోహ్లీ నోటిపై వేలు వేసుకుని నోరు మూసుకుని ఆట ఆడు అంటూ బెయిర్ స్టోకి చూపించాడు. వారి మద్య ఏం జరిగిందో తెలియదు కానీ.. అంపైర్లు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అయితే బౌన్సర్ వేశాక షమీని బెయిర్ స్టో కామెంట్ చేయబట్టే కోహ్లీ స్పందించినట్లు తెలుస్తోంది. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత కోహ్లీ- బెయిర్ స్టో నవ్వుకుంటూ భుజాలపై చేతులు వేసుకుని కనిపించారు. కానీ, మూడో రోజు ఇలా గొడవకు దిగడంతో ఫ్యాన్స్ నివ్వెర పోయారు. కోహ్లీ- బెయిర్ స్టో గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli – brand ambassador of Test cricket! pic.twitter.com/gDmSOsmPWT
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 3, 2022