లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్.. ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. మెుదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు వన్డేల సీరిస్ లో రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ క్రమంలో భారత్ మ్యాచ్ ఓడినప్పటికీ 39 ఏళ్ల రికార్డును మాత్రం భారత బౌలర్ బద్దలు కొట్టాడు. మరి ఇప్పుడు ఆ రికార్డు విశేషాలు ఏంటో తెలుసుకుందా..
1983.. ఈ సంవత్సరాన్ని క్రికెట్ గురించి కొద్దో.. గొప్పో తెలిసిన ఏ ఒక్కరూ మర్చిపోరు. ఎందుకంటే భారత చిరకాల స్వప్నం నెరవేరిన సంవత్సరం అది. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు విండిస్ పై చిరస్మరణీయ విజయంతో తొలిసారి ప్రపంచకప్ ను ముద్దాడింది. ఆ మ్యాచ్ లో ప్రత్యర్థిని కుప్పకూల్చడంలో మెుహిందర్ అమర్ నాథ్ కీలక పాత్రపోషించాడు. అతడు అద్భుత బౌలింగ్ 3/12తో విండిస్ నడ్డి విరిచాడు. ఇదే ఇప్పటి వరకు లార్డ్స్ మైదానంలో ఓ భారత బౌలర్ రికార్డ్. అయితే తాజాగా జరిగిన మ్యాచ్ లో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (4/47)తో ఆ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ పై అలాగే చాహల్ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
For his brilliant bowling figures of 4/47, @yuzi_chahal is our Top Performer from the first innings.
A look at his bowling summary here 👇👇#ENGvIND pic.twitter.com/97NkXBTTbv
— BCCI (@BCCI) July 14, 2022