కన్నడ స్టార్ యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరకి తెలిసిందే. ఈ సినిమాలో యష్ చెప్పే ప్రతి డైలాగ్.. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి నరాల్లో వేడిపుట్టించినవే. అందులో ఒకటైన ‘ఎవ్వడ్రా అల్లాటప్పా రౌడీలను కొట్టి డాన్ అయ్యానని చెప్పింది. నేను ఇప్పటిదాకా కొట్టిన ప్రతీవోడు డానే..’ అనే.. ఈ డైలాగ్, ఇప్పుడు రిషబ్ పంత్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి.. సచిన్, కపిల్ దేవ్, అజారుద్దీన్ వంటి దిగ్గజాల రికార్డులను చెరిపేసిన రిషబ్ పంత్, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ బాది సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
మొన్నటిదాకా రిషబ్ పంత్ అంటే.. నిలకడలేని ఆటతీరు, టీ20లకు మాత్రమే సరిపోయే బ్యాటింగ్ స్టయిల్ అని అందరూ అభిప్రాయపడేవారు. అది కరెక్ట్ కాదు, నేను అన్ని ఫార్మాట్లు ఆడగలను అని ఇప్పటికే నిరూపించిన పంత్.. తానేంటో మరోసారి నిరూపించాడు. క్రికెట్ ప్రపంచంలో 49 ఏళ్లుగా స్థిరంగా ఉండిపోయిన ఫరోక్ ఇంజనీర్ రికార్డు సరసన చేరాడు.
Well Played! @RishabhPant17 👏#ENGvIND pic.twitter.com/6qOrH3pSXm
— RVCJ Media (@RVCJ_FB) July 4, 2022
ఇది కూడా చదవండి: MS Dhoni: కీపింగ్ లో ధోని కింగ్ అనిపించే బెస్ట్ వీడియో. థాంక్స్ టూ ఐసీసీ
ఇంగ్లాండుతో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతోన్న ఐదో టెస్టులో సెంచరీతో చెలరేగిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో మెరిశాడు. తద్వారా ఒకే టెస్టులో సెంచరీ, అర్ద సెంచరీ సాధించిన రెండో భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులు సాధించాడు. ఇక అంతకుముందు 1973లో భారత మాజీ వికెట్ కీపర్ ఫరోఖ్ ఇంజనీర్ ఇంగ్లాండుపై రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా సెంచరీ, హాప్ సెంచరీ సాధించాడు. అతడు తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేశాడు.
Rishabh Pant set new record as Wicket-Keeper#ENGvIND pic.twitter.com/ohnm4e4wvn
— RVCJ Media (@RVCJ_FB) July 4, 2022
ఇది కూడా చదవండి: Rishabh Pant: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి థ్యాంక్స్ చెప్పిన రిషభ్ పంత్!
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో 349 పరుగులు చేసిన రిషబ్ పంత్, విదేశాల్లో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2014లో ధోనీ, ఇంగ్లాండ్ టూర్‌లో సరిగ్గా 349 పరుగులు చేయగా రిషబ్ పంత్ 349 పరుగులతో నిలిచాడు. అదే విధంగా ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత వికెట్ కీపర్‌గా పంత్(203) నిలిచాడు. 230 పరుగులతో బుద్ధి కుందరన్ తొలి స్ధానంలో ఉండగా, ఎంస్ ధోని 224 పరగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
Rishabh Pant, the first Indian wicketkeeper to score 200 runs in an away Test 💪 #ENGvIND pic.twitter.com/3k0OyXoAaH
— ESPNcricinfo (@ESPNcricinfo) July 4, 2022