ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 10వికెట్లతో ఘన విజయం సాధించింది. మెుదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 110 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్లు జస్ప్రీత్ బూమ్రా(6/19), షమీ(3/31)లు నిప్పులు చెరిగారు. వీరి ధాటికి ప్రత్యర్థి జట్టు అత్యల్ప స్కోరుకే పరిమితమైంది. అనంతరం వికెట్ నష్టపోకుండా భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 76* నాటౌట్ (58 బంతుల్లో 7×4, 5×6), శిఖర్ ధావన్ 38* నాటౌట్( 54 బంతుల్లో 4×4) ఆడుతూ.. పాడుతూ.. లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మ్యాచ్ అనంతనరం ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందిస్తూ.. మా ఓటమిని శాసించిన ఒకే ఒక్కడు బూమ్రా. అతని ధాటికే మా టాపార్డర్ అంతా కుప్పకూలిందన్నాడు. బూమ్రా లాంటి బౌలర్ ను ఎదుర్కొవడం కష్టమేనని, అతనో వరల్డ్ క్లాస్ బౌలర్ అని ప్రశంసించాడు. మరీ ముఖ్యంగా మాపై అతడు చెలరేగుతాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమేనని, కానీ ఈ మ్యాచ్ ని మర్చిపోయి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఈ రోజు అందుకున్న గణాంకాలకు బూమ్రా పూర్తిగా అర్హుడని కొనియాడాడు.
Jos Buttler on Boom Boom Bumrah.#JosButtler #JaspritBumrah #Bumrah #INDvsENG #cricketsarthik pic.twitter.com/PybSoCQ9PP
— Sarthik Sharma (@Sarthik_2020) July 12, 2022
పిచ్ పై స్పందిస్తూ.. ‘‘ఈ రోజు బంతి కదలికలు ఆశ్చర్యానికి గురిచేశాయని, పిచ్ కొంచం మగ్గీగా ఉందని దీనిని భారత బౌలర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారన్నాడు. తమ బౌలర్లు వికెట్లు తియ్యాలి అనే ఒత్తిడి వల్ల విఫలమైయ్యారని చెప్పుకొచ్చాడు. ఒత్తిడి వల్ల బౌలర్లు వికెట్లు తియ్యలేరని వెల్లడించాడు. తర్వాతి మ్యాచ్ లో పుంజుకుంటామని’’ ధీమా వ్యక్తం చేశాడు. బట్లర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This Reporter Harassing Jos Buttler about Jasprit Bumrah’s Spell is Hard to Watch 😭😭😭 pic.twitter.com/g3p6Zj1PlD
— Pant’s Reverse Sweep (@SayedReng) July 12, 2022