బోర్డర్-గవాస్కర్ టెస్ట్‌లో భాగంగా ఇండియా ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాను ముప్పతిప్పలు పెడుతోంది. శనివారం ఇండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కంగారులకు కష్టాలు మొదలయ్యాయి. టీమిండియా ఆటగాడు అశ్విన్ స్పిన్‌కు ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోతున్నారు. 67 పరుగులకే ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయింది. తొలుత డెవిడ్ వార్నర్ (10)ను ఔట్ చేసిన అశ్విన్ ఆ వెంటనే.. మాట్ రెన్ షా(2)ను పెవిలియన్‌కు పంపించాడు. ఇప్పటి వరకు అశ్విన్ తన ఖాతాలో ఐదు వికెట్లు వేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు తీసి.. 32వ సారి 5 వికెట్ల హాల్‌లో చేరిన ఆటగాడిగా నిలిచాడు అశ్విన్.
ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో టీమీండియా 400 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో.. ఇండియా.. ఆస్ట్రేలియాపై 223 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక మూడో రోజు రెండో సెషన్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌ను అశ్విన్ వణికిస్తున్నాడు.
Ashwin 🤝 Fifers
How good has @ashwinravi99 been with the ball in the second innings 🔥🔥
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/e3pLGLPrKb
— BCCI (@BCCI) February 11, 2023