భారత్ తో మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఇద్దరు స్టార్ ప్లేయర్ల్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వీళ్లతోనే టీమిండియాకు కష్టాలు తప్పవా అనిపిస్తుంది.
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ జరుగుతుంది. ఇప్పటివరకు రెండు మ్యాచులు జరగ్గా.. అవి వన్ సైడ్ అయిపోయాయి. మన స్పిన్నర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో రెండు టెస్టులు కూడా తలో మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి. చివరి రెండు టెస్టుల్లో అయినా కచ్చితంగా గెలిచి తీరాలి అనుకుంటున్న కంగారూ జట్టుకు వరస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. హేజిల్ వుడ్, వార్నర్, కమిన్స్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఈ రెండు మ్యాచులకు గాయాలు, వ్యక్తిగత విషయాల కారణంగా దూరమయ్యారు. దీంతో ఆ రెండింటిలోనూ భారత్ గెలవడం దాదాపు పక్కా అనిపిస్తుంది.
ఇక విషయానికొస్తే.. టెస్టుల్లో ఓడిపోయాం గానీ వన్డేల్లో మాత్రం అసలు అలా జరగనివ్వం అనే ప్లాన్ తో ఆస్ట్రేలియా టీమ్ ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా మూడు వన్డేల కోసం జట్టుని ప్రకటించింది. ఇది చూస్తే అలానే అనిపిస్తుంది. 16 మంది సభ్యులతో చాలా బలంగా ఉన్న ఈ జట్టు చూస్తుంటే.. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఆతిథ్య టీమిండియాని ఓడిస్తామని ధీమాగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే కమిన్స్ కెప్టెన్ గా ఉండగా.. మ్యాక్స్ వెల్, మిచెల్ మార్ష్, జే రిచర్డ్ సన్ లాంటి కీ ప్లేయర్స్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. స్మిత్, లబుషేన్, వార్నర్, స్టోయినిస్, గ్రీన్, హెడ్ లాంటి స్టార్ క్రికెటర్లు.. సిరీస్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. టెస్టుల్లో అంటే టీమిండియా గెలుపు సులభం కావొచ్చేమో గానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఆస్ట్రేలియా గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది నవంబరులో మన దేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ క్రమంలోనే ఇరుజట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. మరి ఇందులో ఎవరు గెలుస్తారు? ఎలాంటి ప్లాన్స్ తో వస్తారో చూడాలి. ఆల్రెడీ ఐపీఎల్ తో ఇక్కడి పిచ్ లకు బాగా అలవాటు పడిపోయిన మ్యాక్స్ వెల్, మిచెల్ మార్ష్ తో పాటు మిగతా ఆసీస్ క్రికెటర్లను వన్డేల్లో ఔట్ చేయడం భారత్ బౌలర్లకు కాస్త పెద్ద పనే. మరి భారత్- ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.