ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న నిర్ణయాత్మక మూడో వన్డే హోరాహోరీగా సాగుతోంది. నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. విజయావకాశాలు భారత్ వైపే మొగ్గు చూపుతున్నా.. రెండో వన్డేలో భారత వైఫల్యం మరవకూడదు.
ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న నిర్ణయాత్మక మూడో వన్డే హోరాహోరీగా సాగుతోంది. మ్యాచ్ గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని భారత్ ఒకవైపు, వన్డే సిరీస్ గెలిచి టెస్ట్ సిరీస్ కు ప్రతీకారం తీర్చొవాలని ఆసీస్ మరోవైపు. దీంతో మూడో వన్డే పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 269 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించగా, భారత్ అదే రీతిలో జవాబిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన కాసేపటికే యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ భారీ సిక్స్ కొట్టి.. ఆస్ట్రేలియా సారథిని నోరెళ్లపెట్టేలా చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
270 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత బ్యాటర్లు పవర్ ప్లేలోనే జూలు విదిల్చారు. తొలి రెండు ఓవర్లు కాస్త నిదానంగా అనిపించినా మూడో ఓవర్ నుంచి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ కొట్టిన ఓ భారీ సిక్స్ కొట్టి.. ఆస్ట్రేలియా సారథిని నోరెళ్లపెట్టేలా చేసింది. రోహిత్ సైతం.. ఆ షాట్‌ను మెచ్చుకోవటం గమనార్హం. క్లాసిక్ షాట్లతో బౌండరీలు కొట్టే గిల్, ఒక్కసారిగా భారీ సిక్స్ కొట్టడంతో ఆసీస్ ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. స్టార్క్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా గిల్ కొట్టిన సిక్స్.. మెస్మరైజింగ్ అని చెప్పాలి. కాగా, అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఒక ఓవర్ మిగిలివుండగానే ఆలౌట్ అయ్యింది. 49 ఓవర్లలో 269 పరుగుల వద్ద ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
Shubman Gill hits a super six against Mitchell Starc. pic.twitter.com/FMF0qGwfsT
— CricketGully (@thecricketgully) March 22, 2023
ట్రావిస్ హెడ్ (33), మిచెల్ మార్ష్ (42), డేవిడ్ వార్నర్ (23), మార్నస్ లబుషేన్ (28), స్టాయినిస్ (25), అలెక్స్ కెరీ (38).. ఇలా అందరూ నిలకడగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఐతే జట్టు సారథి స్టీవ్ స్మిత్(0) మాత్రం ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. భారత బౌలర్లలో కుల్దీప్, హార్దిక్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అక్సర్ పటేల్ చెరో వికెట్లు తీసుకున్నారు. ఆసీస్‌పై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిందే.
Expression from Rohit & Smith after the six from Gill. pic.twitter.com/XlEk7rx7Mo
— Johns. (@CricCrazyJohns) March 22, 2023