ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా- 2022 సిరీస్‌ని టీమిండియా కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో చెలరేగిన ఇండియా- కంగారూలను చిత్తు చేసింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఇలా అన్నింటా అద్భుత ప్రదర్శన చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియా సిరీస్‌ని 2-1 తేడాతో సొతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్.. తర్వాతి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా మూడో టీ20లో ఆటతీరుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మ్యాచ్ మొత్తాన్ని పక్కన పెడితే ఇప్పుడు నెట్టింట అంతా మ్యాక్స్ వెల్ రనౌట్ గురించే చర్చ నడుస్తోంది. అసలు అది ఔటా? నాటౌటా? అలా ఎలా ఔటిస్తారు? అంటూ పలు ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.
బ్యాటింగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్ట్రాంగ్‌గా కనిపించారు. స్టార్టింగ్‌లోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాకి కామెరోన్ గ్రీన్ 21 బంతుల్లో 52 పరుగులు చేసి మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ నిలదొక్కుకుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. కానీ, 8వ ఓవర్ చాహల్ బౌలింగ్‌లో నాలుగో బంతిని ఎదుర్కొన్న మ్యాక్స్ వెల్ రెండు పరుగుల కోసం ప్రయత్నించి అక్షర్ పటేల్ చేసిన డైరెక్ట్ హిట్‌తో రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే ఆ రనౌట్ ఇప్పుడు సర్వత్రా చర్చకు తెర లేపింది. ఎందుకంటే బాల్ వికెట్లను తాకకముందే
𝐂. 𝐇. 𝐀. 𝐌. 𝐏. 𝐈. 𝐎. 𝐍. 𝐒 🏆#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/5yk3bRnHiV
— BCCI (@BCCI) September 25, 2022
అయితే రనౌట్ విషయంలో బాల్ తాకక ముందే బెయిల్ ఎగిరిపోతే బాల్ చేత్తో పట్టుకుని వికెట్ పైకి తీయాల్సి ఉంటుంది. కానీ, అలా చేయకుండానే రనౌట్ గా ప్రకటించడంతో కొందరికి అలా ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. నిజానికి వికెట్ పైకి తీయాల్సింది రెండు బెయిల్స్ పడిపోతే అలా చేయాల్సి ఉంటుంది. కానీ, మ్యాక్స్ వెల్ రనౌట్‌లో దినేష్ కార్తీక్ చేయి తగిలి కేవలం ఒక బెయిల్ మాత్రమే పడింది. రెండో బెయిల్ వికెట్ల మీద అలాగే ఉంది. ఆ రెండో బెయిల్ అక్షర్ వేసిన బంతి తాకి గాల్లోకి లేచింది. అది ధ్రువీకరించుకున్న తర్వాతే థర్డ్ అంపైర్ మ్యాక్స్ వెల్‌ని రనౌట్‌గా ప్రకటించాడు. ఇది తెలియని చాలా మంది మ్యాక్స్ వెల్ రనౌట్ విషయంలో ఏదో తప్పు జరిగింది. అసలు అది రనౌట్ కాదు కదా అనే చర్చలు చేస్తున్నారు. దినేష్ కార్తీక్ చేత్తో బెయిల్‌ని లేపేశాడు. ఆ తర్వాత బాల్ నేరుగా వికెట్లను తాకింది. థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
CRICKET
3rd T20 | 🇮🇳 India vs 🇦🇺 AustraliaWICKET
Glenn Maxwell (6 runs scored)
Run Out (Axar)FALL OF WICKET
AUS 75 – 3
7.4 oversImage Credits: Hotstar pic.twitter.com/Rokx10gQ0p
— 🇬🇧🇺🇦 VWH Portsmouth | Solidarity with Ukraine (@VWHPortsmouth) September 25, 2022
ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఆస్ట్రేలియాని సమర్థంగానే ఎదుర్కొంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. గ్రీన్(52), టిమ్ డేవిడ్(54) అద్భుతంగా రాణించారు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా మాత్రం చాలా ఎక్స్ పెన్సివ్‌గా కనిపించాడు. 4 ఓవర్లు వేసి 50 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. ఇండియా బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 69) చేశాడు. కోహ్లీ(48 బంతుల్లో 63) కూడా అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమిష్టిగా రాణించి టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఈ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20లు గెలిచిన టీమ్‌గా భారత్ రికార్డుల కెక్కింది. మ్యాక్స్ వెల్ రనౌట్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ICYMI – Rocket throw from the deep by @akshar2026⚡️
And then, a bit of luck on #TeamIndia‘s side…🤞
Watch how Maxwell got out.
Full video – https://t.co/3H42krD629 #INDvAUS pic.twitter.com/71YhhNjakw
— BCCI (@BCCI) September 25, 2022