ఎన్నో వింతలు, ఉత్కంఠభరిత మ్యాచ్ లతో ఐపీఎల్ 2022 సీజన్ దూసుకెళ్తోంది. ఆదివారం జరిగిన రాజస్థాన్ రాయల్స్– లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ అయితే నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ మ్యాచ్ రిజల్స్ సంగతి పక్కన పెట్టేసి.. రవిచంద్రన్ అశ్విన్ గురించే సోషల్ మీడియా మొత్తం చర్చలు జరుగుతున్నాయి. అశ్విన్ మాటతో గానీ, ఆటతోగానీ ఏదొన సంచలనం సృష్టిస్తాడు.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారతాడు అని మరోసారి రుజువైంది. రాజస్థాన్ బ్యాటర్ జోస్ బట్లర్ ను మన్‌కడ్ రనౌట్ చేసి అశ్విన్ ఎన్నో చర్చలకు మూల బిందువయ్యాడు. ప్రస్తుతం అదే రాజస్థాన్ టీమ్ తరఫున ఆడుతూ రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగి మరో కొత్త రికార్డు సృష్టించాడు.
ఇదీ చదవండి: కృనాల్ పాండ్యా చేసిన ఆ ఒక్క తప్పే లక్నో కొంపముంచిందా?
క్రికెట్ లో రిటైర్డ్ హర్ట్ మాదిరిగానే రిటైర్డ్ అవుట్ కూడా ఉంటుంది. రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిన వ్యక్తి చివరిలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ చేరితే మాత్రం.. ఆ మ్యాచ్ లో మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాసం రాదు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ చేరిన ప్లేయర్ ఎవరూ లేరు. మొదటిసారి అశ్విన్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో 19వ ఓవర్ నడుస్తుండగా రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. అతని స్థానంలో రియాన్ పరాగ్ బ్యాటింగ్ కు దిగాడు. అతను సిక్స్ కొట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే అశ్విన్ రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగిన సంగతి.. క్రీజులో ఉన్న హెట్ మెయర్ కి గానీ, లక్నో టీమ్ కు గానీ, కామెంటేట్రలకు గానీ తెలియదు. అసలు ఎందుకు వెళ్తున్నాడు అని అందరూ చూశారు. కాసేపటికి అతను రిటైర్డ్ అవుట్ అని ప్రకటించారు.ఈ నిర్ణయంపై రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ స్పందించాడు. ‘రాజస్థాన్ రాయల్స్ జట్టుగా మేము సీజన్ కి ముందే కొన్ని వ్యూహాలు రచించుకున్నాం. అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాం. పరిస్థితిని బట్టి జట్టు కోసం మేం నిర్ణయాలు తీసుకుంటాం’ అంటూ సంజు శాంసన్ స్పందించాడు. అశ్విన్ రిటైర్డ్ అవుట్ పై సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తోంది. అది చాలా తెలివైన్ మూవ్ అని ప్రశంసిస్తున్నారు. మన్‌కడ్ తర్వాత అశ్విన్ మరో రికార్డు సృష్టించాడంటూ ఇంకొందరు కొనియాడుతున్నారు. అశ్విన్ రిటైర్డ్ అవుట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— James Tyler (@JamesTyler_99) April 10, 2022
Riyan Parag comes in for Ashwin 😂🤌 what a strategy! #IPL2022 #LSGvRR #CricketTwitter
— Harshit Poddar (@harshitpoddar09) April 10, 2022
Wow, 1st time seen someone #RetiredOut in @IPL (at 18.2 over)
After that #Mankad moment vs. @rajasthanroyals/ @josbuttler, thank you for this special one (for #RR this time around): @ashwinravi99 Anna 🙌 😅#LSGvsRR
— ViSHaL 🇮🇳 (@vishal_z3) April 10, 2022
It was always going to be Ashwin that did it, wasn’t it? Retired out. Love it! @rajasthanroyals #ashwin #IPL2022 #LSGvRR
— Aadil Firdous77 (@AadilFirdous77) April 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.