ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ సంబరం మొదలై పోయింది. మొదటిరోజే ఉత్కంఠభరితంగా సాగాయి మ్యాచ్‌లు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను సైతం మట్టికరిపించిన బంగ్లాదేశ్‌కు క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. పసికూన కాదని ఎప్పుడో నిరూపించుకున్న బంగ్లాదేశ్.. వారికన్నా ఎంతో తక్కువ అనుభవం ఉన్న స్కాట్లాండ్ జట్టు చేతిలో పరాజయం పాలవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 140 పరుగులు చేసింది. 141 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ పెద్దగా ప్రభావం చూపలోకపోయింది.
ఇదీ చదవండి: యాంకర్ రవి.. శ్వేత వర్మకు ఎందుకు సెట్ కాలేదు? వాళ్ల మధ్య అసలు జరిగింది ఇదే!
బంగ్లాదేశ్ ఓటమి విషయంలో ఒక్క విభాగాన్ని అనడానికి లేదు. మొదట బౌలర్లు స్కాట్లాండ్‌ను తక్కువ పరుగులకు పరిమితం చేయడంలో విఫలమయ్యారు. తర్వాత బంగ్లాదేశ్ టాపర్డర్ స్కాట్లాండ్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ కేవలం 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కాట్లాండ్ ప్లేయర్ క్రిస్ గ్రీవ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ పరంగా 28 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అటు బౌలింగ్ పరంగానూ క్రిస్ గ్రీవ్స్ 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మ్యాన్స్ ఆఫ్ దిమ్యాచ్‌గా నిలిచాడు. అందరినీ ఆకట్టుకున్న స్కాట్లాండ్ జట్టుపై నెట్టింట ఫుల్ ప్రశంసల జల్లు కురుస్తోంది. స్కాట్లాండ్ జట్టును అంచనావేయడంలో బంగ్లాదేశ్ విఫలమైందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shot of the day by MUNSEY 🔥
What a six! #T20WorldCup
Scotland VS Bangladesh pic.twitter.com/PEiyvqLEIK— Sushant Mehta (@SushantNMehta) October 17, 2021