ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఓడిపోవచ్చు. ఆటగాళ్ల అప్పుడప్పుడు ఫెయిల్ కావొచ్చు. కానీ అద్భుతమైన ప్లేయర్లు అనే టాపిక్ వస్తే మాత్రం అందరూ టీమిండియా గురించే మాట్లాడుకుంటారు. సిరీసులు, ఐపీఎల్ పుణ్యమా అని కుర్రాళ్లతో పాటు సీనియర్లు కూడా విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడారు. అద్భుతమైన ప్లేయర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పలువురు విదేశీ స్టార్ క్రికెటర్లు.. మన ఆటగాళ్లపై ప్రశంసలు చేయడం ఎప్పుడూ ఉండేదే. కానీ ఇమ్రాన్ తాహిర్ మాత్రం.. మన జట్టులోని స్టార్ ప్లేయర్ ని ఆకాశానికెత్తేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ గురించి మన వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ చెన్నై తరఫున ఆడిన ఇతడు.. భారత్ లోనూ చాలామంది అభిమానుల్ని సంపాదించాడు. ఇక ఇప్పుడు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోనే క్లాస్ ప్లేయర్ అని మెచ్చుకున్నాడు. జట్టు కోసం ఎన్నో వండర్స్ కూడా చేశాడని చెప్పాడు. ఓ న్యూస్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. దీంతో విరాట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
మొన్నమొన్నటి వరకు విరాట్ కోహ్లీ రన్స్ కొట్టకపోయేసరికి మనోడి పనైపోయిందని తెగ ట్రోల్ చేశారు. దీనికి బ్యాటుతోనే సమాధానమివ్వాలని ఫిక్స్ అయిన విరాట్.. ఆసియాకప్ లో సెంచరీ చేసి ఆన్సర్ చెప్పాడు. దీని తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయాడు. ఇక పాక్ తో మ్యాచ్ లో అయితే పాత కోహ్లీని గుర్తుచేస్తూ బ్యాటింగ్ చేశాడు. మెల్ బోర్న్ గ్రౌండ్ లో కొట్టిన సిక్సులు ఇప్పటికీ ఫ్యాన్స్ మైండ్ లో అలా తిరుగుతున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో పలువురు స్టార్ క్రికెటర్లు, మాజీలు.. విరాట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి విరాట్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Imran Tahir said “Virat Kohli is a great player, he has done wonders for Team, he is world class”. (@VibhuBhola from News 24 Sports)
— Johns. (@CricCrazyJohns) November 24, 2022