యూఏఈ వేదికగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2023 టోర్నీలో విషాదం చోటుచేసుకుంది. వెస్టిండీస్ బౌలర్, గల్ఫ్ గెయింట్స్ ఆటగాడు డొమినిక్ డ్రేక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ పట్టబోయి.. అదుపుతప్పిన డ్రేక్స్ బలంగా భూమిని తాకాడు. అనంతరం అతడు లేవకపోగా.. ఎలాంటి మూమెంట్ లేదు. దీంతో సిబ్బంది హుటాహుటీన స్ట్రెచర్ పై తీసుకెళ్లి.. వెంటనే అంబులెన్సులో సమీప ఆసుపత్రికి తరలించారు. షార్జా వారియర్స్ vs గల్ఫ్ జెయింట్స్ మధ్య జరుగుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సహచర ఆటగాళ్లు అతడు క్షేమంగా ఉండాలని ప్రార్థించడం గమనార్హం.
డ్రేక్స్ గాయం కారణంగా కాసేపు ఆగిన మ్యాచ్ అనంతరం యధాతధంగా సాగుతోంది. అచ్చం ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప వంటి భారత మాజీ ఆటగాళ్లు కూడా ఆరంగ్రేటం చేశారు. భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు మినహా మొయిన్ అలీ, మార్కస్ స్టోయినీస్, ఎల్విన్ లెవీస్, జేమ్స్ విన్స్, టామ్ బాంటన్, క్రిస్ లిన్,డేవిడ్ వీస్, కార్లోస్ బ్రాత్ వైట్.. ఇలా అన్ని దేశాల క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు. డ్రేక్స్ త్వరగా కోలుకోవాలని మనమూ ఆశిద్దాం..
Dominic Drakes has been taken to hospital after injuring his arm while taking a catch.
📸: Zee5#Cricket #DominicDrakes #SWvGG #DPWorldILT20 #CricTracker pic.twitter.com/pVW27J9XHr
— CricTracker (@Cricketracker) February 6, 2023
Dominic Drakes has just been loaded into this ambulance on a stretcher at Sharjah, after suffering a facial/head injury while taking a brilliant – and very brave – diving catch for Gulf Giants in the ILT20 pic.twitter.com/tZpqe6jsYG
— Paul Radley (@PaulRadley) February 6, 2023