రన్ మెషీన్‌గా, కెప్టెన్‌గా ఇండియన్ క్రికెట్‌పై విరాట్ కోహ్లీ తనదైన ముద్ర వేశాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. కెప్టెన్‌గా టీమిండియాను విజయపథంలో నడిపించాడు. టెస్టుల్లో తొలి స్థానంలో నిలిపాడు. అలాంటి కోహ్లీపై నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ఎంతలా అంటే టీమిండియాకు విరాట్ కోహ్లీ భారంగా మారిపోయాడు, జట్టులో ప్లేస్ కష్టమే అంటూ లేని ప్రెషర్‌ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరగనున్న రెండో టీ20కి ముందు అసలు కోహ్లీకి తుది జట్టులో చోటు దక్కడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
ఐపీఎల్ 2022, టెస్టుల్లో విరాట్ కోహ్లీ విఫలమైన మాట వాస్తవమే కానీ.. టీ20ల్లో కోహ్లీ ఆడిన చివరి 12 మ్యాచ్‌లను గమనిస్తే.. ప్రస్తుతం కోహ్లీ గురించి జరుగుతున్న ప్రచారం అర్థంగా అనిపిస్తుంది. కోహ్లీ ఆడిన గత 12 టీ20 మ్యాచ్‌ల్లో 61.62 యావరేజ్‌తో 493 పరుగులు చేశాడు. అందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంటే కోహ్లీ ఫామ్‌లో లేకుంటే 61 ప్లస్ యావరేజ్‌తో పరుగులు ఎలా చేయగలడు. ఇప్పుడు భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే సిరీస్‌లో పాల్గొంటున్న రెండు దేశాల ఆటగాళ్లలో చాలా మంది ప్లేయర్ల చివరి 12 మ్యాచ్‌ల సగటు కోహ్లీ కంటే తక్కువ. అయినా కూడా కోహ్లీ ఫామ్‌లో లేడంటూ అసత్య ప్రచారం జరుగుతుంది.
ఫామ్‌లో లేకుండానే కోహ్లీ ఈ సగటుతో ఇన్ని పరుగులు చేస్తే.. ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఆడితే ఎలా ఉంటుందని.. విరాట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారకులకు చురకలు అంటిస్తున్నారు. ఆస్ట్రేలియా లాంటి దేశంలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ అవసరం టీమిండియాకు ఎంతైనా ఉంది. రెండు మూడు ఇన్నింగ్స్‌ల్లో రాణించనంత మాత్రాన ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్‌లపై కూడా ఇదే విధంగా ఆడతారనుకోవడం అతివిశ్వాసం అవుతుంది.
గతేడాది అక్టోబర్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు వెంటవెంటనే అవుట్ అవుతున్నా.. కోహ్లీ ఒక్కడే నిలబడ్డ విషయం మర్చిపోవద్దు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 57 పరుగులు చేయడంతో భారత్ 151 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. లేకుంటే పాక్‌చేతిలో మరింత దారుణమైన ఓటమి చవిచూసే అవకాశం వచ్చేదంటూ కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
According to BCCI sources, Virat Kohli’s T20I future and his place for T20 WC will depend on how he performs in the two T20I & ODIs in England series.
Meanwhile Kohli in his last 14 T20 matches :
Innings – 12
Runs – 493
Average – 61.62
Strike rate – 135.45
Fifties – 6 pic.twitter.com/ct3DbH6d7k— Mr_feiz_17 (@Apka_Apna_JEEJU) July 7, 2022