T20 World Cup 2022: ఒకసారి కనుమరుగు ఆటగాళ్లు మరోసారి జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం అన్నది చాలా అరుదు. అందులోనూ 140 కోట్లకు పైగా జనాభా, నైపుణ్యంలో కొదవలేని ఆటగాళ్లు ఉన్న మనదేశంలో అది శక్తికి మించిన పనే. మొదటి భార్య మోసం, స్నేహితుడి వెన్నపోటుతో క్రికెట్ పైనే శ్రద్ధ కోల్పోయిన దినేష్ కార్తీక్.. రెండేళ్ల క్రితం జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఆపై.. దీపికా పల్లికల్ పరిచయం కావడం, అది పెళ్లి వరకు దారితీయడం, పాత జ్ఞాపకాలు మరిచివపోవడంతో అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగి స్వదేశంలో జరిగిన ఐపీఎల్ 2022 సీజన్ లో ఆద్బుతంగా రాణించాడు. ఫలితంగా జాతీయ జట్టులోకి మరోసారి పునరాగమనం చేశాడు. ఈ తరుణంలో రోహిత్ శర్మతో కలిసి15 ఏళ్ల తర్వాత మరోసారి పొట్టి ప్రపంచ కప్ ఆడనున్నాడు.
ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న దినేష్ కార్తీక్ కు ఇదే ఆఖరి పొట్టి ప్రపంచ కప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ రాణించినా రెండేళ్ల తరువాత అంటే.. ఆనాడు పరిస్థితులు ఎలా ఉంటాయో. 2004లో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన దినేష్ కార్తీక్.. తొలి టీ20 వరల్డ్ కప్ 2007 ఆడిన భారత జట్టులో సభ్యుడు. ఆ టోర్నీలో ప్రస్తుత భారత సారథి రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఆ ఏడాది ఛాంపియన్‌గా నిలిచింది. ఈ తరువాత ఆరుసార్లు టీ20 వరల్డ్ కప్స్ జరిగినా దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ కలిసి ఆడింది లేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనబోతున్నారు. దీంతో మరోసారి 2007 టీ20 వరల్డ్ కప్ రిజల్ట్ రిపీట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Dinesh Karthik and Rohit Sharma are the only 2 players from the inaugural T20 World Cup 2007 squad to feature in the 2022 India squad for the T20 World Cup.They both have come a long way..🥶💙@ImRo45 @DineshKarthik#T20WorldCup pic.twitter.com/oppL4ozo1X
— R 45 👣 (@Tommm_Jerryy) September 12, 2022
పీయూష్ చావ్లా, రాబిన్ ఊతప్ప, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ మినహా 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో మిగిలిన ఆటగాళ్లందరూ క్రికెట్ కి వీడ్కోలు పలికిన వారే. చావ్లా, ఊతప్ప రిటైర్మెంట్ తీసుకోకపోయినా.. ఈ వయసులో వారు, మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం అసాధ్యమే. 35 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టును నడిపించబోతుంటే, 37 ఏళ్ల దినేశ్ కార్తీక్.. ఫినిషర్ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో ఆనాటి జ్ఞాపకాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. దీంతో కలిసి తొలి టీ20 వరల్డ్ కప్ ఆడి గెలిచిన ఈ ఇద్దరూ, ఆఖరి టీ20 వరల్డ్ కప్‌లోనూ అదే రిజల్ట్ రాబట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Part of ICC T20 World Cup 2007 winning squad.
15 Years later, Dinesh Karthik will be part of India’s #T20WorldCup Squad.DK – True Inspiration 💙
Best of luck @DineshKarthik#T20WorldCup2022 #DineshKarthik #DK #T20WC #INDvPAK #CricketTwitter pic.twitter.com/7yppWQO8Q9— Off Field Cricket (@OffFieldCricket) September 12, 2022