మ్యాచ్ ఏదైనా తుది జట్టు కూర్పు టీమిండియా కెప్టెన్, కోచ్‌లకు పెద్ద తలనొప్పిగా మారింది. అందుకు కారణం జట్టులో కొన్ని ప్లేస్‌లకు తీవ్ర పోటీ ఉండటమే. ముఖ్యంగా ఓపెనింగ్ స్పాట్, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్, మిడిల్డార్ బ్యాటర్ ఈ ప్లేస్‌లకు భారత జట్టులో భారీ పోటీ నెలకొంది. ఈ స్థానాలకు ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు పోటీ పడుతుండటంతో ఎవర్ని తుది జట్టులోకి తీసుకోవాలనే విషయంపై కెప్టెన్, కోచ్, టీమ్ మేనేజ్‌మెంట్ జట్టు పీక్కొవాల్సి వస్తోంది. తాజాగా ఆస్టేల్రియాతో మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోయే టెస్టు సిరీస్‌కు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే.. ఈ టెస్టులో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుందనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా రోహిత్ శర్మతో కలిసి ఎవరు ఇన్నింగ్స్ ఆరంభిస్తారోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. చాలాకాలంగా రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ జోడీ టీమిండియాకు ఓపెనింగ్ జోడీగా ఉంది. కానీ.. కేఎల్ రాహుల్ తన స్థాయికి తగ్గ ఫామ్‌లో లేకపోవడం, మరోవైపు యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో.. ఈ సారి రోహిత్‌తో గిల్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టీమ్‌కు తన అవసరం ఉందనుకుంటే.. మిడిల్డార్‌లోనూ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నాడు. అంటే.. గిల్ కోసం తన ఓపెనింగ్ స్థానం త్యాగం చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పకనే చెప్పాడు.
టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ కొంతకాలం చెత్త ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే వన్డే వైస్ కెప్టెన్‌గా కూడా రాహుల్‌ను తప్పించి, ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. కానీ.. టెస్టుల్లో మాత్రం అతన్నే వైప్ కెప్టెన్‌గా కొనసాగిస్తున్నారు. టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు కానీ.. తుది జట్టులో ప్లేస్ ఉంటుందా లేదా అనే విషయంపై మాత్రం రాహుల్‌కు గ్యారెంటీ లేదు. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన రాహుల్ పై విధంగా పేర్కొన్నాడు. అయితే.. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో లేకపోవడం రాహుల్‌కు కలిసొచ్చే అంశం. అతని స్థానంలో రాహుల్ మిడిల్డార్‌లో ఆడే అవకాశం ఉంది. మరి తుది జట్టులో ప్లేస్ విషయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What do you think? 👀🤔#klrahul #BorderGavaskarTrophy #Cricket #CricketTwitter pic.twitter.com/hZwpMKmv80
— RVCJ Sports (@RVCJ_Sports) February 7, 2023