2021 ఏడాదికి గాను ఐసీసీ టెస్టు జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా టెస్టు జట్టు తాజా మాజీ సారథి విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. కానీ భారత్ నుంచి ఏకంగా ముగ్గురు ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. టీమిండియా టీ20, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనర్‌గా ఐసీసీ టెస్టు జట్టులో చోటు దక్కింది. అలాగే వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు, స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌కు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఎంపికయ్యాడు.
జట్టులో కరుణరత్నే(శ్రీలంక), రోహిత్ శర్మ(ఇండియా), మార్నస్ లబుషేన్(ఆసీస్), జో రూట్(ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్(కెప్టెన్)(కివీస్), ఫవాద్ ఆలం(పాకిస్థాన్), రిషభ్‌పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా), కైల్ జెమీసన్(కివీస్), హసన్ అలీ, షహీన్ అఫ్రిదీ(పాకిస్థాన్) ఉన్నారు. కాగా ఈ జట్టులో సౌత్ ఆఫ్రికా నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. అలాగే ఐసీసీ వన్డే జట్టులో భారత్ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కని విషయం తెలిసిందే. మరి ఈ జట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🇵🇰🇵🇰🇵🇰
🇮🇳🇮🇳🇮🇳
🇳🇿🇳🇿The 2021 ICC Men’s Test Team of the Year is here 💪
Here’s the XI 👇 https://t.co/JG88Td6jHj
— ICC (@ICC) January 20, 2022