ఐసీసీ టీ20 ప్రపంచకప్ సంబరం మరో కొద్ది రోజుల్లోనే మొదలు కానుంది. అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా పొట్టి క్రికెట్ సమరం జరగనుంది. ఇక్కడ యావత్ క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం ఎంతో దూరంలో లేదు. అక్టోబరు 24న దుబాయ్ వేదికగా దాయాదీలు తలపడనున్నారు. భారత్- పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ దృష్యా మొదట ప్రేక్షకులును అనుమతించకుండా ప్రపంచకప్ మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు సద్దుమణిగిన నేపథ్యంలో అభిమానులను అనుమతించాలని నిర్ణయించారు. కాకాపోతే మైదానంలో 70 శాతం మందికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
భారత్, పాక్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ, ఆసియా కప్‌లో మాత్రమే దాయాదుల పోరు చూసేందుకు అవకాశం లభిస్తోంది. ఈ కారణంతోనే ఇప్పుడు ఈ మ్యాచ్‌లకు అంత డిమాండ్ ఏర్పాడింది. క్రికెట్ అభిమానులే కాదు.. మాజీ క్రికెటర్లు కూడా వీరి మ్యాచ్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఐసీసీ నిర్ణయంతో టికెట్ల విక్రయం మొదలు పెట్టేశారు. భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అందరూ ఆశ్చర్యపోయేలా కేవలం గంటలోనే టికెట్లు అన్నీ అమ్మడుపోయాయి. దీన్ని బట్టి కూడా వారి మ్యాచ్‌కున్న ఏంటో అర్థమవుతోందా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం సామర్థ్యం 25000. 70 శాతం మందికి అనుమతి అంటే.. దాదాపు 18,500 మందికి అనుమతి ఉంటుంది. కరోనా సమయంలో 18 వేల టికెట్లు గంటలోపే అమ్ముడు పోవడం విశేషం.